TRADITIONAL WOODEN COFFINS ARE RUNNING SHORT IN HONG KONG AS AUTHORITIES SCRAMBLE TO ADD MORTUARY SPACE PVN
Covid In Hong Kong : హాంకాంగ్ మార్చురీల్లో భారీగా కరోనా మృతదేహాలు
హాంకాంగ్ లో కరోనా విజృంభణ(ప్రతీకాత్మక చిత్రం)
Wooden Coffins Shortage In Hong Kong : మార్చురీల్లో కూడా ఖాళీ లేకపోవడంతో ...ఎమర్జెన్సీ రూమ్స్ లో పేషెంట్ల పక్కన మృతదేహాలు పేర్చిన దృశ్యాలు అందరినీ షాక్ కు గురిచేస్తున్నాయి. హాంకాంగ్ లో ఇప్పటివరకు 11లక్షల 83వేలకు పైగా కరోనా కేసులు నమోదుకాగా
Hong Kong funeral services overwhelmed by Covid : కరోని మహమ్మారి ఖతం అయ్యిందని ప్రశాంతంగా జీవిస్తున్న ప్రజలకు మరోసారి పిడుగులాంటి వార్త వచ్చి పడింది. చైనాతో పాటు హాంకాంగ్ లో కూడా కరోనా విజృంభణ కొనసాగుతోంది. ప్రస్తుతం హాంకాంగ్ లో కరోనా ఐదో వేవ్ కొనసాగుతోంది. అయితే ఓ వైపు కేసులతో పాటు మరణాలు కూడా భారీగా పెరుగుతున్నాయి హాంకాంగ్ లో ఏ మార్చురీ చూసినా మృత దేహాలతో నిండిపోయి కనిస్తోంది. అయితే శవపేటికల కొరత కారణంగా అంత్యక్రియల ఏర్పాట్లలో జాప్యం తప్పడం లేదు. చైనాలోని షెన్ జెన్ నుంచి హాంకాంగ్ కు శవపేటికలు సరఫరా అవుతాయి. అయితే చైనాలో కూడా కరోనా కేసులు పెరగడంతో వీటి రవాణా నిలిచిపోయింది.
హాంకాంగ్ కు సాధారణ రోజుల్లో రోజుకు 250 నుంచి 300 శవపేటికలు అవసరం. ఇప్పడు మరణాల సంఖ్య పెరగడంతో వాటికి డిమాండ్ పెరిగింది. మార్చి 14 నుండి 26 వరకు 3 వేల 570 శవపేటికలను ఉపయోగించారు. ప్యూనరల్ డైరక్టర్ లాక్ చుంగ్(37) నిర్వాహకుడు మాట్లాడుతూ... ఇక్కడ సాధారణంగా నెలకు 15 అంత్యక్రియలు జరుగుతాయి.. గత మార్చి నెలలో ఏకంగా 40 అంత్యక్రియలు జరిగాయి. మార్చురీలో ఇంత పెద్ద సంఖ్యలో మృత దేహాలు పోడవడం గతంలో ఎన్నడూ చూడలేదని అతను తెలిపారు. మార్చి 1 న మరణించిన ఒక మహిళ యొక్క కుటుంబం ఇప్పటికీ ఆమె మృతదేహాన్ని క్లెయిమ్ చేయడానికి పేపర్స్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నారని తెలిపారు.
చనిపోయిన వారి అంత్యక్రియల కోసం చైనీస్ ఉపయోగించే సాంప్రదాయ పేపర్ ను ప్రతిబింబించే కాగితాల కొరత కూడా హాంకాంగ్ లో ఉందని అతను తెలిపారు. మరోవైపు,మార్చురీల్లో కూడా ఖాళీ లేకపోవడంతో ...ఎమర్జెన్సీ రూమ్స్ లో పేషెంట్ల పక్కన మృతదేహాలు పేర్చిన దృశ్యాలు అందరినీ షాక్ కు గురిచేస్తున్నాయి. హాంకాంగ్ లో ఇప్పటివరకు 11లక్షల 83వేలకు పైగా కరోనా కేసులు నమోదుకాగా,8వేల 550కి పైగా మరణాల నమోదయ్యాయి.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.