కరోనాపై పోరాటంలో భారత్ ముందంజ.. కేంద్రం చేపట్టిన ఈ చర్యలే అందుకు కారణం

కరోనాపై పోరాటంలో భారత్ ముందంజ.. కేంద్రం చేపట్టిన ఈ చర్యలే అందుకు కారణం

ఢిల్లో ఓ వ్యక్తి నుంచి కరోనా పరీక్ష నిమిత్తం శాంపుల్ సేకరిస్తున్న ఆరోగ్య సిబ్బంది

India's Fight Against Covid-19: భారత దేశం కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో ప్రపంచంలోనే ముందు వరుసలో నిలించింది. మన దేశం చేపట్టిన అనేక మందు జాగ్రత్త చర్యలు సత్ఫలితాలు ఇవ్వడమే అందుకు కారణంగా చెప్పవచ్చు.

 • Share this:
  కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే భారత్ ముందు వరుసలో నిలిచింది. ఈ లెక్కలను పరిశీలిస్తే ఆ విషయం స్పష్టమవుతుంది. నవంబర్ నాటికి మిలియన్ జనాభాకు మన దేశంలో 6,731 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే యునైటెడ్ స్టేట్స్ లో ఈ సంఖ్య 40 వేలు కాగా, యూకేలో 23, 361, ఫ్రాన్స్ లో 33,361. బ్రెజిల్ లో 29,129, ఇటలీలో 25,456గా ఉంది. దీన్ని బట్టి అనేక దేశాల్లో మన దేశంతో పోలిస్తే 4, 5 రెట్లు అధికంగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇంకా కరోనా మరణాల విషయానికి వస్తే మన దేశంలో మిలియన్ జనాభాకు 98 మంది కరోనా కారణంగా చనిపోయారు. అదే అమెరికాలో ఆ సంఖ్య 813 కాగా, బ్రెజిల్ లో 805, ఫ్రాన్స్ లో 780, స్పెయిన్ లో 955, యూకేలో 846, ఇటలీలో 888గా ఉంది. అనేక దేశాల్లోని కరోనా మరణాలు మన దేశంతో పోల్చితే 8 నుంచి 9 రెట్లు అధికంగా ఉన్నాయి. సెప్టెంబర్ నెలలో మన దేశంలో కరోనా కేసుల నమోదు అత్యధిక స్థాయికి చేరింది. ఆ సమయంలో సరాసరిగా 97, 894 కేసులు నమోదు కాగా నవంబర్ 26 నాటికి ఆ సంఖ్య 43,174కు తగ్గింది.

  జనవరి నుంచే జాగ్రత్త చర్యలు..
  చైనా కరోనా వైరస్ గురించి ప్రకటించిన దాదాపు 10 రోజుల్లోనే మన దేశం యుద్ధప్రాతిపదికన జాగ్రత్త చర్యలను ప్రారంభించింది. జనవరి 17 నుంచే మన దేశంలోని ఏయిర్ పోట్లలో స్క్రీనింగ్ ప్రారంభించారు. జనవరి 30న మన దేశంలో మొదటి కరోనా కేసు నమోదైంది. అప్పటి నుంచి స్క్రీనింగ్ ప్రక్రియ ఇంకా పకడ్భందీగా నిర్వహించడం ప్రారంభించారు. రాపిడ్ ఆంటిజెన్ టెస్టులు, RT-PCR పరీక్షలను సైతం ఇండియానే మొదటి సారిగా ప్రారంభించింది. మొదట ఈ విధానంపై విమర్శలు వచ్చినా తర్వాత WHO సైతం ఈ విధానాన్ని అంగికరించి ఇతరులకు సూచించింది. మార్చి మొదటి వారంలోనే మన దేశంలో హోళీ వేడుకల సమయంలో ప్రధాని మోదీ ముందు జాగ్రత్తగా ప్రజలకు పిలుపునిచ్చారు. కరోనా నేపథ్యంలో వేడుకలకు దూరంగా ఉండాలని సూచించారు. ఇది కరోనా నివారణకు మన దేశం చేపట్టిన ముందు జాగ్రత్త చర్యలకు నిదర్శనంగా చెప్పవచ్చు.

  ఫలితాన్నిచ్చిన ముందస్తు లాక్ డౌన్
  మన దేశంలో కేవలం 500 కేసులు ఉన్న సమయంలోనే ప్రధాని మోదీ లాక్ డౌన్ కు పిలుపునిచ్చారు. ఆ సమయంలో మన దేశంలో కేసుల గ్రోత్ రేట్ 10.9 నుంచి 19.6 కు చేరింది. ఆ సమయంలో లాక్ డౌన్ కు పిలుపునివ్వడం ఏ మాత్రం ఆలస్యం అయినా మన దేశం భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చేది. ప్రభుత్వ ముందు జాగ్రత్త చర్యలతో మనకు ఆ పెద్ద ముప్పు తప్పింది. లాక్ డౌన్ సమయాన్ని సైతం మన ప్రభుత్వం సద్వినియోగం చేసుకుంది. 15.40 లక్షల ఐసోలేషన్ బెడ్లు, 2.70 లక్షల ఆక్సీజన్ సపోర్టెడ్ బెడ్లు, 78 వేల ఐసీయూ బెడ్లును మనం సమకూర్చుకోగలిగాం. 32,400 వెంటిలేటర్లను ఆ సమయంలో కేంద్రం రాష్ట్రాలకు పంపించింది.

  జాతి ఐక్యత చాటిన జనతా కర్ఫ్యూ.. ప్రధాని సూచనలు పాటించిన ప్రజలు
  కరోనా సమయంలో ప్రధాని మోదీ స్వయంగా అనేక సార్లు స్వయంగా మీడియా ముందుకు వచ్చి ప్రజలకు సూచనలు ఇచ్చారు. తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలను వివరించారు. పరిస్థితి తీవ్రతను ప్రధానే స్వయంగా తెలపడంతో ప్రజలంతా అలర్ట్ అయ్యారు. జాగ్రత్త చర్యలను పాటించారు. మొదటగా ప్రధాని ఇచ్చిన జనతా కర్ఫ్యూ ను ప్రజలంతా పాటించి జాతి ఐక్యతను చాటారు. ప్రధాని పిలుపు మేరకు చప్పట్లు కొట్టి, దీపాలు వెలిగించి కరోనా వారియర్స్ కు మద్దతుగా నిలిచారు.

  ప్రజలకు అండగా ప్రభుత్వం..
  కరోనా సమయంలో ఉపాధి కోల్పోయిన అనేక మందికి ప్రభుత్వం అండగా నిలిచింది. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ ద్వారా రూ. 1.70 లక్షలు కేటాయించి మహిళలు, పేదలు, రైతులకు ఉచితంగా బియ్యం తదితర ఆహార ధాన్యాలు అందించారు. 42 కోట్ల పేదలకు రూ. 68,820 కోట్లను అందించారు. పీఎం కిసాన్ స్కీం ద్వారా 9 కోట్ల మంది కార్మికులకు రూ.17,891 కోట్లను అందించారు. 20 కోట్ల మంది మహిళలకు రూ. 31 కోట్లను జన్ ధన్ ఖాతాల్లోకి మూడు ఇన్ స్టాల్ మెంట్లలో జమ చేశారు. వృద్ధులకు, వితంతువులకు సైతం సహాయం అందిచారు. 13 కోట్ల ఉజ్వల గ్యాస్ సిలిండర్లను పేదలకు అందించారు.

  వ్యాక్సిన్ తయారీలోను ముందంజ..
  కరోనా వ్యాక్సిన్ తయారీలోనూ భారత్ ముందంజలో ఉంది. ప్రధాని మోదీ వ్యాక్సిన్ తాయారీ విషయంలో ప్రత్యేక చోరవ తీసుకుంటున్నారు. వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమైన హైదరాబాద్ లోని భారత్ బయోటెక్, జిడస్ బయోటెక్ అహ్మదాబాద్, పూణేలోని సీరం ఇనిస్ట్యూట్ ను ప్రధాని స్వయంగా సందర్శించడం ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. ప్రపంచలోని అనేక దేశాలు భారత్ లో తయారవుతున్న వ్యాక్సిన్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. డిసెంబర్ 4న 100 వివిధ దేశాలకు చెందిన అంబాసిడర్లు పూనేలోని సీరం ఇనిస్ట్యూట్ ను, జెన్నోవా బయో ఫార్మసిటికల్స్ ను సందర్శించనున్నారు.

  అన్ లాక్ అనంతరం పుంజుకున్న ఎకానమి..
  కరోనా నేపథ్యంలో ముందస్తుగా లాక్ డౌన్ విధించిన కేంద్రం.. దేశ ఎకానమీ దెబ్బ తినకుండా అన్ లాక్ చర్యలను సైతం ప్రారంభించింది. దీంతో దేశంలో ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకుంది. ప్యాసింజర్ వాహనాల సేల్స్ 2 శాతం పెరగగా, టూ వీలర్స్ సేల్స్ 16.8 శాతం పెరిగింది. జీఎస్టీ వసూళ్లు అక్టోబర్ లో రూ. 1.05 లక్షల కోట్లకు చేరాయి. ఫిబ్రవరిలో వసూళ్లు రూ. లక్ష కోట్లను మరో సారి అక్టోబర్ లో దేశం దాటింది.

  ఆర్థిక వ్యవస్థపై ప్రభావం..
  కరనా నేపథ్యంలో దేశ జీడీపీ ప్రస్తుత త్రైమార్షికంలో -7.5శాతం తగ్గింది. గత త్రైమార్షికంలోని -23.9తో పోలీస్తే ఇది చాలా తక్కువ. వ్యవసాయ రంగంలో 3.4 శాతం గ్రోత్ రెండో త్రైమార్షికంలో నమోదైంది. మానిఫాక్చరింగ్ రంగంలోనూ 0.6 శాతం నమోదైంది.
  Published by:Nikhil Kumar S
  First published:

  అగ్ర కథనాలు