వంట చేస్తున్న రేవంత్ రెడ్డి .. నెట్టింట్లో ఫొటో వైరల్..

ఫైర్ బ్రాండ్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మాత్రం వెరైటీగా ఇంటి వద్ద సమయం గడుపుతున్నారు. గరిటె పట్టి కుటుంబ సభ్యుల జిహ్వకు రుచి చూపిస్తున్నారు.

news18-telugu
Updated: March 24, 2020, 2:45 PM IST
వంట చేస్తున్న రేవంత్ రెడ్డి .. నెట్టింట్లో ఫొటో వైరల్..
వంట చేస్తున్న రేవంత్ రెడ్డి
  • Share this:
కరోనా వైరస్ నేపథ్యంలో దేశంలోని అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ విధిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ కూడా అమలు చేస్తున్నారు. దీంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ చేస్తుంటే.. వ్యాపారులు కాస్త విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇన్నాళ్లు బిజీగా గడిపిన వాళ్లంతా కుటుంబ సభ్యులతో సేద తీరుతున్నారు. వీధిలోకి వచ్చి మాట్లాడే అవకాశం కూడా లేదు. ఇంటి బయట కాలు పెట్టే పరిస్థితి లేకపోవడంతో ఇంట్లోనే కాలక్షేపం చేస్తున్నారు. అయితే.. నిత్యం ప్రజల్లో ఉండి, ప్రజా సమస్యలు తెలుసుకొనే రాజకీయ నాయకులకు ఇంటి వద్ద ఉండటం పెద్ద సవాలే. చుట్టూ జనం లేకపోతే వారికి ఇబ్బందే.

అయితే, ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా ఇంటి వద్దే ఉంటూ కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. కాకపోతే.. ఫైర్ బ్రాండ్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మాత్రం వెరైటీగా ఇంటి వద్ద సమయం గడుపుతున్నారు. గరిటె పట్టి కుటుంబ సభ్యుల జిహ్వకు రుచి చూపిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటో ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. మైకులు పట్టి అధికార పార్టీపై నిప్పులు చెరిగే రేవంత్.. నిప్పుల కుంపటిపై వంట చేస్తుండటంతో ఆయన అభిమానులు, కార్యకర్తలు మురిసిపోతున్నారు.

గరిటె పట్టిన రేవంత్
Published by: Shravan Kumar Bommakanti
First published: March 24, 2020, 2:45 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading