తెలంగాణలో జర్నలిస్టులకు ప్రత్యేక ప్యాకేజీ: గూడూరు డిమాండ్

తెలంగాణలో జర్నలిస్టులకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని టీ పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి డిమాండ్ చేశారు.

news18-telugu
Updated: April 23, 2020, 10:09 PM IST
తెలంగాణలో జర్నలిస్టులకు ప్రత్యేక ప్యాకేజీ: గూడూరు డిమాండ్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణలో జర్నలిస్టులకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని టీ పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి డిమాండ్ చేశారు. కరోనావైరస్ మహమ్మారిని కవర్ చేస్తున్న జర్నలిస్టులకు హర్యానా ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ .10 లక్షల బీమా రక్షణ ప్రకటించిందని చెప్పారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కూడా కోవిడ్ -19 కవర్ చేస్తున్న అక్రిడేషన్ ఉన్న జర్నలిస్టులకు బీమా పథకాన్ని విస్తరించిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా రాష్ట్రంలోని జర్నలిస్టుల కోసం భీమా కల్పించాలని గూడూరు నారాయణరెడ్డి డిమాండ్ చేశారు. ‘వందలాది మంది రిపోర్టర్లు, కెమెరాపర్సన్లు, ఫోటోగ్రాఫర్లు, డెస్క్‌ సభ్యులు, న్యూస్ యాంకర్ లు పని చేస్తున్నారు. ప్రతిరోజూ ఆరోగ్యాన్ని, జీవితాలను పణంగా పెడుతున్నారు. మహారాష్ట్ర, తమిళనాడులలో చాలా మంది జర్నలిస్టులు కరోనావైరస్ బారిన పడ్డారు. కరోనావైరస్ కు వ్యతిరేకంగా జరిగే యుద్ధంలో పాలుపంచుకుంటున్న మీడియా వాళ్ళకి భీమా కల్పించి వారి సేవలను గుర్తించాలి.’ అని గూడూరు నారాయణరెడ్డి కోరారు. మీడియాలో పనిచేస్తున్న వారిలో ఎక్కువ మంది ఆర్దిక సమస్యలతో సతమతమవుతున్నారని, దీన్ని దృష్టిలో ఉంచుకొని జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక ప్యాకేజి ప్రకటించాలని కోరారు. లోక్డౌన్ కారణంగా సిబ్బందిని తొలగించకుండా మీడియా సంస్థల యాజమాన్యాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశించాలన్నారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: April 23, 2020, 10:05 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading