Home /News /coronavirus-latest-news /

TPCC CHIEF UTTAM KUMAR SLAMS CM KCR OVER CORONA CASES IN TELANGANA SK

కరోనాపై తప్పుడు లెక్కలు.. కేసీఆర్‌పై ఉత్తమ్ తీవ్ర విమర్శలు

ఉత్తమ్ కుమార్, కేసీఆర్ (File)

ఉత్తమ్ కుమార్, కేసీఆర్ (File)

కరోనా వ్యాప్తి గురించి రాహుల్ గాంధీ ముందే హెచ్చరికలు చేసినప్పటికీ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదని విమర్శలు గుప్పించారు భట్టి విక్రమార్క.

  తెలంగాణలో కరోనా కేసుల సంఖ్యను తక్కువగా చూపిస్తున్నారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ICMR అప్రూవ్ చేసిన ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఎందుకు టెస్ట్‌లు చేయడం లేదని విమర్శించారు. సౌత్ కొరియాను ఆదర్శంగా చేసుకొని.. పెద్ద ఎత్తున టెస్ట్‌లు చేయాల్సిన అవసరం ఉందన్నారు ఉత్తమ్. సోమవారం వీడియో కాన్పరెన్స్ ద్వారా సీఎల్పీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. ఇక కరోనా వ్యాప్తి గురించి రాహుల్ గాంధీ ముందే హెచ్చరికలు చేసినప్పటికీ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదని భట్టి విక్రమార్క విమర్శలు గుప్పించారు .

  తెలంగాణలో కేసుల సంఖ్య తక్కువ చూపిస్తున్నారన్న అనుమానాలు ఉన్నాయి. పరీక్షలు పెద్ద స్థాయిలో చేయాలి. సౌత్ కొరియాను ఆదర్శంగా తీసుకోవాలి. తెలంగాణలో లక్ష మందికి 37 మందికి మాత్రమే టెస్ట్ చేశారు. నెల రోజులు దాటినప్పటికి 1500 రూపాయలు ఇంత వరకు అందరికి ఎందుకు అందలేదు?
  కరోన వల్ల పేద వర్గాల వారికి కాంగ్రెస్ క్యాడర్ సహాయం అందచేస్తు అద్భుతంగా పని చేస్తున్నారు.
  ఉత్తమ్ కుమార్


  రాహుల్ గాంధీ కరోన గురించి ముందే హెచ్చరికలు చేసినప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదు. చాలా మంది ప్రజలకు రేషన్ దొరకడం లేదు. మాస్క్‌ల పంపిణి నిర్లక్ష్యంగా ఉంది. రేషన్‌ను నేరుగా ఇంటికి పంపిచే ఏర్పాట్లు చేయాలి. సీఎం కేసీఆర్ ప్రెస్‌మీట్‌లకే పరిమితం అవుతున్నారు. ధాన్యం కొనుగోళ్లు నత్తనడక సాగుతోంది. వలస కార్మికులకు షెల్టర్, మెడికల్ హెల్త్ అమలు చేయవలసి ఉన్నప్పటికీ వారిని పట్టించుకోవడం లేదు.
  భట్టి విక్రమార్క

  రాష్ట్ర ప్రభుత్వం బియ్యం తప్ప ఏమీ ఇవ్వడం లేదు.. నిత్యావసర సరుకులను కూడా ప్రజలకు ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు.
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: CM KCR, Coronavirus, Covid-19, Uttam Kumar Reddy

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు