Choose Municipal Ward
    CLICK HERE FOR DETAILED RESULTS

    ఏపీ ప్రభుత్వాన్ని చూసైనా సీఎం కేసీఆర్ నేర్చుకోవాలి...ఉత్తమ్ ఎద్దేవా

    కరోనా కట్టడిలో పక్క రాష్ట్రం ఏపీ ప్రభుత్వాన్ని చూసైనా సీఎం కేసీఆర్ నేర్చుకోవాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. కరోనా కేసులు, మరణాలను తెలంగాణ ప్రభుత్వం దాస్తోందని ఆరోపించారు.

    news18-telugu
    Updated: August 26, 2020, 9:27 PM IST
    ఏపీ ప్రభుత్వాన్ని చూసైనా సీఎం కేసీఆర్ నేర్చుకోవాలి...ఉత్తమ్ ఎద్దేవా
    ఉత్తమ్ కుమార్ రెడ్డి (ఫైల్ ఫోటో)
    • Share this:
    కోవిడ్ నివారణ చర్యల్లో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. గాంధీభవన్ ‌లో బుధవారం మీడియాతో మాట్లాడిన ఉత్తమ్..కోవిడ్ కేసులు, మరణాలను ప్రభుత్వం దాస్తోందని ఆరోపించారు. కరోనాతో చనిపోయిన వారిని ఇతర రోగాలతో మృతిచెందినట్లు ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందన్నారు. రాష్ట్రంలో సరైన సంఖ్యలో కోవిడ్ పరీక్షలు నిర్వహించడం లేదని విమర్శించారు. కరోనా కట్టడి విషయంలో పక్కనే ఉన్న ఏపీ ప్రభుత్వాన్ని చూసైనా సీఎం కేసీఆర్ నేర్చుకోవాలని హితవుపలికారు. కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చేందుకు ప్రభుత్వాకున్న సమస్యేంటని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లేందుకు ప్రజలు భయపడుతున్నారని అన్నారు. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్దామంటే..అక్కడి బిల్లులు భయపెడుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. కరోనా నేపథ్యంలో ప్రజలకు అండగా నిలిచేందుకు సీఎల్పీ ఆధ్వర్యంలో ఆస్పత్రుల సందర్శన నిర్వహిస్తామన్నారు.

    అంతకు ముందు సేవాదల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించిన తర్వాత డీసీసీ అధ్యక్షులతో ఉత్తమ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలం చెందిందని...ఆ పార్టీపై ప్రజల్లో క్రమంగా వ్యతిరేకత పెరుగుతోందన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని ఉత్తమ్ ధీమా వ్యక్తంచేశారు.
    Published by: Janardhan V
    First published: August 26, 2020, 9:26 PM IST
    మరిన్ని చదవండి
    తదుపరి వార్తలు

    Top Stories

    corona virus btn
    corona virus btn
    Loading