44 లక్షలు దాటిన కరోనా కేసులు.. 3 లక్షలకు చేరువలో మరణాలు..

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 44 లక్షలు దాటింది. తాజా సమాచారం ప్రకారం ఇప్పటి దాకా 44,25,639 కేసులు నమోదయ్యాయి.

news18-telugu
Updated: May 14, 2020, 6:32 AM IST
44 లక్షలు దాటిన కరోనా కేసులు.. 3 లక్షలకు చేరువలో మరణాలు..
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు (credit - who)
  • Share this:
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 44 లక్షలు దాటింది. తాజా సమాచారం ప్రకారం ఇప్పటి దాకా 44,25,639 కేసులు నమోదయ్యాయి. మొత్తం 2,97,765 మంది కరోనా సోకి మరణించారు. అటు.. 16,57,068 మంది వ్యాధి నుంచి కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 24,70,806 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అందులో 45,921 మంది ఆరోగ్యం క్రిటికల్‌గా ఉంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల్లో అమెరికా ప్రథమ స్థానంలోనే ఉంది. నిన్న కొత్తగా 21,712 కేసులు నమోదయ్యాయి. 1772 మంది చనిపోయారు. మొత్తంగా ఆ దేశంలో 85,197 మంది మృతి చెందారు. అమెరికా తర్వాత బ్రెజిల్‌లో 754, యూకేలో 494, మెక్సికోలో 353, ఇటలీలో 195, స్పెయిన్‌లో 184, స్వీడన్‌లో 147 మంది చనిపోయారు.
Published by: Shravan Kumar Bommakanti
First published: May 14, 2020, 6:32 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading