దేశంలో 199 కరోనా మరణాలు.. మొత్తం పాజిటివ్ కేసులు ఎన్నంటే..

ప్రతీకాత్మక చిత్రం

దేశంలో కరోణా మరణాలు 199కి చేరాయి. ఒక్క మహారాష్ట్రలోనే 97 మరణాలు చోటుచేసుకున్నాయి. అక్కడ మొత్తం 1364 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

  • Share this:
    దేశంలో కరోణా మరణాలు 199కి చేరాయి. ఒక్క మహారాష్ట్రలోనే 97 మరణాలు చోటుచేసుకున్నాయి. అక్కడ మొత్తం 1364 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇది దేశంలోనే అత్యధికం. ఆ తర్వాత తమిళనాడులో 834, ఢిల్లీలో 720, రాజస్థాన్‌లో 463, తెలంగాణలో 442, ఉత్తరప్రదేశ్‌లో 410, కేరళలో 357, ఆంధ్రప్రదేశ్‌లో 348, మధ్యప్రదేశ్‌లో 259, గుజరాత్‌లో 241, కర్ణాటకలో 181, హరియాణాలో 169, జమ్మూ కశ్మీర్‌లో 158, పశ్చిమ బెంగాల్‌లో 116, పంజాబ్‌లో 101, ఒడిశాలో 44, బిహార్‌లో 39, ఉత్తరాఖండ్‌లో 35, అసోంలో 29, ఛండీగఢ్‌లో 18, హిమాచల్ ప్రదేశ్‌లో 18, లడఖ్‌లో 15, జార్ఖండ్‌లో 13, అండమాన్ నికోబార్ దీవుల్లో 11, ఛత్తీస్‌గఢ్‌లో 10, గోవాలో 7, పుదుచ్చేరిలో 5, మణిపూర్‌లో 2, అరుణాచల్ ప్రదేశ్‌లో 1, మిజోరంలో 1, త్రిపురలో 1 కేసు నమోదయ్యాయి.

    అటు.. అండమాన్ నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, అసోం, ఛండీగఢ్, ఛత్తీస్‌గఢ్, గోవా, లడఖ్, మణిపూర్, మిజోరం, పుదుచ్చేరి, త్రిపుర, ఉత్తరాఖండ్‌లో ఏ ఒక్క కరోణా మరణం చోటుచేసుకోకపోవడం మంచి పరిణామం.

    మొత్తం కేసులు 6412
    యాక్టివ్ కేసులు 5710
    మరణాలు 199
    డిశ్చార్జి అయినవారు 503
    Published by:Shravan Kumar Bommakanti
    First published: