Corona India | ఒక్క రోజే 9,987 కరోనా కేసులు.. మొత్తం 2,66,598..

ప్రతీకాత్మక చిత్రం

భారత్‌లో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య అమాంతం పెరుగుతూనే ఉంది. రోజుకు కనీసం పదివేల కేసులు నమోదవుతున్నాయి.

  • Share this:
    భారత్‌లో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య అమాంతం పెరుగుతూనే ఉంది. రోజుకు కనీసం పదివేల కేసులు నమోదవుతున్నాయి. కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపిన వివరాల ప్రకారం గత 24 గంటల్లో 9,987 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,66,598కు చేరుకుంది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 1,29,917 ఉండగా 1,29,215 మంది డిశ్చార్జి అయ్యారు. ఫలితంగా రికవరీ రేటు 48.46గా నమోదైంది. కాగా, దేశవ్యాప్తంగా మొత్తం 7,466 మంది కరోనా సోకి మరణించారు. గత 24 గంటల్లో 266 మంది చనిపోయారు. రాష్ట్రాల వారీగా చూస్తే మహారాష్ట్రలో 88,528 కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో 33వేలు, ఢిల్లీలో 29,943, గుజరాత్‌లో 20,545 కేసులు నమోదయ్యాయి.
    Published by:Shravan Kumar Bommakanti
    First published: