దేశంలో 23వేల కరోనా కేసులు.. 700 దాటిన మరణాలు..

ప్రతీకాత్మక చిత్రం

ఇండియాలో కరోనా కేసుల సంఖ్య 23 వేలకు చేరుకుంది. అటు.. మరణాల సంఖ్య 700 దాటింది. ఈ రోజు ఉదయం 8 గంటలకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. 718 మంది చనిపోయారు.

  • Share this:
    ఇండియాలో కరోనా కేసుల సంఖ్య 23 వేలకు చేరుకుంది. అటు.. మరణాల సంఖ్య 700 దాటింది. ఈ రోజు ఉదయం 8 గంటలకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. 718 మంది చనిపోయారు. కేసుల సంఖ్య 23,077గా నమోదైంది. వైరస్ నుంచి కోలుకొని 4749 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతానికి 17,610 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రాల వారీగా చూస్తే మహారాష్ట్రలో 6,430 కేసులు నమోదు కాగా.. గుజరాత్ 2624, ఢిల్లీ 2376, రాజస్థాన్ 1964, మధ్యప్రదేశ్ 1699, తమిళనాడు 1683, ఉత్తరప్రదేశ్ 1510 కేసులు నమోదయ్యాయి.

    ఇదిలా ఉండగా, తెలంగాణలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 970కి చేరింది. వీరిలో కరోనాతో పోరాడుతూ 262 మంది కోలుకున్నారు. మొత్తంగా 25 మంది మరణించారు. ఏపీలో 893 కరోనా కేసులుండగా.. 590 కేసులు కర్నూలు, గుంటూరు, కృష్ణా, చిత్తూరు జిల్లాల్లోనే నమోదయ్యాయి.
    Published by:Shravan Kumar Bommakanti
    First published: