అమెరికాలో మరణ మృదంగం.. ప్రపంచవ్యాప్తంగా 38 లక్షల మందికి కరోనా..

చైనాలో పుట్టి ఆ దేశాన్ని భయపెట్టినా.. ఇటలీలో అల్లకల్లోలం సృష్టించినా.. మిగతా ప్రపంచ దేశాల్లో విజృంభించినా.. అమెరికాలో మాత్రం మరణ మృదంగం మోగిస్తోంది కరోనా.

news18-telugu
Updated: May 7, 2020, 6:22 AM IST
అమెరికాలో మరణ మృదంగం.. ప్రపంచవ్యాప్తంగా 38 లక్షల మందికి కరోనా..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
చైనాలో పుట్టి ఆ దేశాన్ని భయపెట్టినా.. ఇటలీలో అల్లకల్లోలం సృష్టించినా.. మిగతా ప్రపంచ దేశాల్లో విజృంభించినా.. అమెరికాలో మాత్రం మరణ మృదంగం మోగిస్తోంది కరోనా. మొత్తం మరణాల్లో దాదాపు 30 శాతం మరణాలు ఇక్కడే చోటుచేసుకుంటున్నాయి. నిన్న ఒక్క రోజే అమెరికాలో 2,524 మంది చనిపోయారు. మొత్తం 74,795 మంది చనిపోయారు. ఇక ప్రపంచవ్యాప్తంగా మొత్తం 2,64,811 మంది మృతి చెందారు ఈ మహమ్మారి దెబ్బకు. ప్రస్తుతం 38,18,791 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. 12,99,221 మంది ఆ వ్యాధి నుంచి కోలుకొన్నారు. అయితే, 22,54,759 యాక్టివ్ కేసులు ఉన్నాయని.. అందులో 48,208 మంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తాజా నివేదిక తెలిపింది.

దేశాల వారీగా చూస్తే.. నిన్న ఒక్క రోజే యూకేలో 649 మంది, బ్రెజిల్‌లో 645 మంది, ఇటలీలో 369 మంది, బెల్జియంలో 323 మంది, జర్మనీలో 282 మంది, ఫ్రాన్స్‌లో 278 మంది, స్పెయిన్‌లో 244 మంది, మెక్సికోలో 236 మంది, కెనడాలో 189 మంది కరోనా సోకి మరణించారు.
Published by: Shravan Kumar Bommakanti
First published: May 7, 2020, 6:22 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading