తెలంగాణ ఇంటర్ బోర్డులో కలకలం... ఉద్యోగులకు కరోనా పాజిటీవ్

కరోనా వైరస్ సోకిన ఇంటర్ బోర్డు సిబ్బందిలో కొందరు ఎగ్జామినేషన్ బ్రాంచ్‌లో విధులు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో ఇంటర్ రీకౌంటింగ్, రీవాల్యుయేషన్‌పై ప్రభావం చూపొచ్చన్న వాదన వినిపిస్తోంది.

news18-telugu
Updated: July 1, 2020, 6:25 PM IST
తెలంగాణ ఇంటర్ బోర్డులో కలకలం... ఉద్యోగులకు కరోనా పాజిటీవ్
తెలంగాణ ఇంటర్ బోర్డులో కలకలం... ఉద్యోగులకు కరోనా పాజిటీవ్ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
తెలంగాణ ఇంటర్ బోర్డులో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది. ఇప్పటి వరకు తెలంగాణ ఇంటర్ బోర్డులో ఆరుగురు సిబ్బందికి కరోనా వైరస్ సోకినట్టు నిర్థారణ అయింది. అంతేకాదు... వారి కుటుంబ సభ్యుల్లో 9 మందికి కరోనా పాజిటీవ్ అని తేలింది. ఇవి తాజాగా వెల్లడైన కేసులే. గతంలో కూడా ఇంటర్ బోర్డులో కరోనా వైరస్ కలకలం సృష్టించింది. గతంలో కూడా ఇంటర్ బోర్డులో ఆరుగురికి కరోనా సోకినట్టు తేలింది. తాజాగా 130 మంది సిబ్బంది కరోనా పరీక్షలు చేయించుకోగా 89 మంది ఫలితాలు విడుదలయ్యాయి. వారిలో ఆరుగురు సిబ్బందితో పాటు వారి కుటుంబ సభ్యుల్లో 9 మందికి కరోనా వైరస్ సోకినట్టు తేలింది. దీంతో ఇంటర్ బోర్డులో 12 మందికి, వారి కుటుంబ సభ్యులు 9 మందికి కరోనా సోకినట్టు తేలింది. కరోనా వైరస్ సోకిన ఇంటర్ బోర్డు సిబ్బందిలో కొందరు ఎగ్జామినేషన్ బ్రాంచ్‌లో విధులు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో ఇంటర్ రీకౌంటింగ్, రీవాల్యుయేషన్‌పై ప్రభావం చూపొచ్చన్న వాదన వినిపిస్తోంది.

IBPS RRB 2020: బ్యాంకు ఉద్యోగాల జాతర... 9640 పోస్టులతో ఐబీపీఎస్ నోటిఫికేషన్

ఇంటర్ రీకౌంటింగ్, రీవాల్యుయేషన్‌ దరఖాస్తు గడువు జూన్ 30న ముగిసింది. అంతకుముందు 2020 జూన్ 24గా ఉన్న చివరి తేదీని జూన్ 30 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. ఇంటర్ బోర్డులో కరోనా వైరస్ కలకలం సృష్టించిన సమయంలోనే దరఖాస్తు గడువును పొడిగించారు. రోజులు గడుస్తున్న కొద్దీ ఇంటర్ బోర్డులో కరోనా వైరస్ పాజిటీవ్ కేసుల సంఖ్య పెరుగుతుండటం ఉద్యోగుల్లో ఆందోళనను పెంచుతోంది. ఇప్పటికే కార్యాలయానికి సందర్శకులను అనుమతించట్లేదు అధికారులు. పరీక్షల నిర్వహణ నుంచి ఫలితాల విడుదల వరకు విద్యార్థులకు, ఇన్విజిలేటర్లకు, అధ్యాపకులకు, వ్యాల్యుయేషన్‌లో పాల్గొన్నవారికి కరోనా వైరస్ సోకకుండా అనేక జాగ్రత్తలు తీసుకున్నాఅధికారులు. కానీ ఇంటర్ ఫలితాలు విడుదలైన తర్వాత ఇంటర్ బోర్డులో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది.

 
First published: July 1, 2020, 6:20 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading