హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

Hyderabad: హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో కరోనా కలకలం.. 12 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ..

Hyderabad: హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో కరోనా కలకలం.. 12 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ..

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

నిన్న బ్రిటన్‌ నుంచి వచ్చిన రంగారెడ్డి జిల్లా వాసికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో.. వారిని టిమ్స్‌కు తరలించారు. దీంతో విదేశాల నుంచి వచ్చిన వారిలో కరోనా నిర్ధారణ అయిన సంఖ్య 12కు చేరుకుంది.

  కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయాందోళనల నేపథ్యంలో.. విదేశాల నుంచి వస్తున్న వారికి ఎయిర్‌పోర్టులోనే కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పలు దేశాల నుంచి హైదరాబాద్ వచ్చిన విదేశీ ప్రయాణికుల్లో 11 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ రోజు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో దిగిన వారికి ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు చేయగా కరోనా బారినపడ్డట్లు అధికారులు గుర్తించారు. దీంతో అధికారులు వారిని గచ్చిబౌలిలోని టిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ 11 మంది ప్రయాణికుల్లో బ్రిటన్ నుంచి నుంచి తొమ్మిది మంది, సింగపూర్‌, కెనడా, అమెరికా నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. వీరి నుంచి నమూనాలను సేకరించి జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ కోసం పంపారు.ఇక నిన్న బ్రిటన్‌ నుంచి వచ్చిన రంగారెడ్డి జిల్లా వాసికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో.. వారిని టిమ్స్‌కు తరలించారు. దీంతో విదేశాల నుంచి వచ్చిన వారిలో కరోనా నిర్ధారణ అయిన సంఖ్య 12కు చేరుకుంది.

  నిన్న కర్నాటకలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు నమోదైన తరువాత చాలామందిలో ఆందోళన మొదలైంది. కోవిడ్ కొత్త వేరియంట్ సోకిన దేశాల జాబితాలో భారత్ కూడా చేరింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒమిక్రాన్ వేరియంట్‌ను ఆందోళన కలిగించే వైరస్‌గా పేర్కొనడంతో.. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ దీనికి సంబంధించి తలెత్తుతున్న పలు ప్రశ్నల జాబితాను విడుదల చేసింది. ఒమిక్రాన్ గురించి ప్రజలు భయపడవద్దని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. భారత్‌లో ఒమిక్రాన్ సోకిన ఒక రోగి వయస్సు 66 సంవత్సరాలు, మరొకరి వయస్సు 46 సంవత్సరాలు. వారిలో ఒకరు దక్షిణాఫ్రికా పౌరుడు కాగా, మరొకరు స్థానిక వైద్యుడు. ఈ సమయంలో టీకాలు వేయడం, జీనోమ్ సీక్వెన్సింగ్ మరియు ప్రయాణ నియమాలలో అప్రమత్తత ద్వారా దీనిని ఎదుర్కోవచ్చని కోవిడ్ టాస్క్ ఫోర్స్ సభ్యుడు తెలిపారు.

  దేశంలో విదేశీ ప్రయాణికులు వచ్చే అంతర్జాతీయ విమానాశ్రాయాలు దాదాపు 12 ఉన్నాయి. ఇక్కడ అధిక ప్రమాదం ఉన్న దేశాల నుంచి విమానాలు వస్తున్నాయి. ఇక్కడి నుంచి వచ్చే ప్రయాణికులకు తప్పనిసరి పరీక్షలు చేస్తున్నారు. దీనితో పాటు రిస్క్ జాబితాలో చేర్చబడిన దేశాల నుండి వచ్చే ప్రయాణీకుల స్క్రీనింగ్ కోసం ఢిల్లీ మరియు ముంబై విమానాశ్రయాలలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయబడ్డాయి.

  Omicron: దేశంలో కరోనా ఒమిక్రాన్ సోకిన ఆ ఇద్దరి పరిస్థితి ఏంటి ? అసలు ఆ ఇద్దరు ఎవరు ?

  ఇండియాలోకి ప్రవేశించిన కరోనా ఒమైక్రాన్.. రెండు కేసులు నమోదు

  ప్రస్తుతానికి ఈ కొత్త కోవిడ్ వేరియంట్ డెల్టా అంత ప్రమాదకరమా ? కాదా ? అనే ప్రశ్నకు సమాధానం ఇంకా రాలేదు. ప్రస్తుతం ప్రపంచం నలుమూలల నుండి శాస్త్రవేత్తలు వైరస్ స్వభావాన్ని, దాని తీవ్రతను గురించి అధ్యయనం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం రావడానికి ఒకటి నుండి రెండు వారాలు పడుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థకు కూడా ఈ వేరియంట్ గురించి పెద్దగా సమాచారం లేదు. ఇది ఆందోళన కలిగించే వేరియంట్‌గా పేర్కొన్నప్పటికీ, గత వేరియంట్ కంటే ఇది చాలా అంటువ్యాధి అని WHO తెలిపింది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Coronavirus, Omicron corona variant

  ఉత్తమ కథలు