TOLLYWOOD HOPES ON UNLOCK 3 AS CENTRE MAY GIVE GREEN SIGNAL TO THEATERS AK
Unlock-3: టాలీవుడ్లో కొత్త ఆశలు రేపుతున్న ‘అన్‌లాక్ 3.0’
టాలీవుడ్ (ప్రతీకాత్మక చిత్రం)
Unlock-3: సినిమా ధియేటర్లు తెరుచుకోవడానికి కేంద్రం షరతులతో కూడిన అనుమతి ఇచ్చినా... దసరా నాటికి పరిస్థితి ఏదో రకంగా చక్కబడుతుందనే యోచనలో టాలీవుడ్ పెద్దలు ఉన్నారు.
త్వరలోనే అన్‌లాక్ 3.0 స్టేజ్‌లోకి వెళ్లబోతున్న భారత్.. కొత్తగా ఏయే రంగాలకు అనుమతి ఇస్తుందనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. దీనిపై ప్రధాని నరేంద్రమోదీ నేడు క్లారిటీ ఇవ్వనున్నారు. ముఖ్యమంత్రులతో సమావేశం తరువాత కేంద్రం దీనిపై తుది నిర్ణయం తీసుకోనుంది. అయితే సినిమా ధియేటర్లు, జిమ్‌లను తిరిగి తెరిచేందుకు కేంద్రం ఓకే చెప్పే అవకాశం ఉందనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. జిమ్‌ల సంగతి ఎలా ఉన్నా... సినిమా ధియేటర్లు తెరుచుకునేందుకు కేంద్రం ఎప్పుడెప్పుడు అనుమతి ఇస్తుందా ? అని ఎదురుచూస్తున్న పలు సినీ రంగాలు... కేంద్రం ఈ రకమైన నిర్ణయం తీసుకుంటే తమ నెత్తిన పాలు పోసినట్టే అనే భావనలో ఉన్నాయి.
సినిమా ధియేటర్(ప్రతీకాత్మక చిత్రం)
ఈ జాబితాలో బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌కు ఉంది. ఇప్పటికే టాలీవుడ్‌కు చెందిన పలు సినిమా షూటింగ్స్ చివరి దశలో ఉన్నాయి. అయితే సినిమా ధియేటర్లు ఎప్పుడు తెరుస్తారనే దానిపై క్లారిటీ లేకపోవడంతో..వారంతా షూటింగ్స్‌ను పక్కన పెట్టేశారు. ఒకవేళ తాము షూటింగ్స్ పూర్తి చేసినా... ధియేటర్లు తెరుచుకోనప్పుడు లాభం ఉండదనే భావనలో చాలామంది సినీ నిర్మాతలు, స్టార్స్ షూటింగ్స్ కొనసాగింపుపై అంతగా ఆసక్తి చూపడం లేదు. అయితే తాజాగా కేంద్రం అన్‌లాక్ 3.0 ప్రక్రియలో భాగంగా ధియేటర్లు తెరుచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే... సినిమా షూటింగ్స్ కూడా మళ్లీ మొదలయ్యే అవకాశం లేకపోలేదనే వార్తలు వినిపిస్తున్నాయి.
సినిమా షూటింగ్(ప్రతీకాత్మక చిత్రం)
టాలీవుడ్‌కు చెందిన కొందరు స్టార్ హీరోలు కరోనా వ్యాక్సిన్ వచ్చేంతవరకు షూటింగ్స్‌కు నో చెబుతుంటే... కొందరు యంగ్ హీరోలు, దర్శకులు మాత్రం సినిమా ధియేటర్లు తెరుచుకునే నిర్ణయం వచ్చిన తరువాత షూటింగ్స్ మొదలుపెడదామనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. సినిమా ధియేటర్లు తెరుచుకోవడానికి కేంద్రం షరతులతో కూడిన అనుమతి ఇచ్చినా... దసరా నాటికి పరిస్థితి ఏదో రకంగా చక్కబడుతుందనే యోచనలో టాలీవుడ్ పెద్దలు ఉన్నారు. మొత్తానికి సినిమా ధియేటర్లు తెరిచే విషయంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.