రెండు తెలుగు రాష్ట్రాలకు తన వంతు ఆర్ధిక సాయం ప్రకటించిన త్రివిక్రమ్..

సమాజం నుండి తీసుకోవడమే కాదు.. ఆ సమాజానికి ఏదైన కష్టం కలిగితే తమ వంతు సాయం చేయడానికి మన సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా ముందుకు వస్తున్నారు. తాజాగా తెలుగు అగ్ర దర్శకుడు తన వంతుగా రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు తన వంతుగా..

news18-telugu
Updated: March 26, 2020, 10:46 AM IST
రెండు తెలుగు రాష్ట్రాలకు తన వంతు ఆర్ధిక సాయం ప్రకటించిన త్రివిక్రమ్..
త్రివిక్రమ్ Photo : Twitter
  • Share this:
సమాజం నుండి తీసుకోవడమే కాదు.. ఆ సమాజానికి ఏదైన కష్టం కలిగితే తమ వంతు సాయం చేయడానికి మన సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ అనేది మన దేశాన్నే కాదు.. ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఈ వైరస్ ధాటికి ఎంతో మంది ప్రాణాలు ఒదలుతున్నారు. ఈ వైరస్ తీవ్రతను కట్టడి చేయడానికి ఇప్పటికే భారత ప్రభుత్వం 21 రోజులు దేశం మొత్తాన్ని లాక్‌డౌన్‌ ప్రకటించింది. లాక్‌డౌన్ కారణంగా ఎంతో మంది బీద ప్రజలు పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజలను ఆదుకునేందుకు తమ వంతు సాయం చేస్తున్నాయి. ఈ కోవలనే పలువురు సినీ నటులు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు తమ వంతు సాయం అందిస్తున్నారు.ఇప్పటికే పవన్ కళ్యాణ్.. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు చెరో రూ.50 లక్షల చొప్పున మొత్తంగా రూ.కోటి విరాళాన్ని కాసేపటి క్రితమే ప్రకటించారు. అంతకుముందు హీరో నితిన్ కూడా రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు చెరో రూ.10 లక్షల వంతున ఆర్ధిక సాయం అందించారు.తాజాగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు చెరో రూ.10 లక్షల విరాళం చొప్పున మొత్తంగా రూ.20 లక్షల ఆర్ధిక సాయం అందజేస్తున్నట్టు ప్రకటించారు.


ఇక హీరో రాజశేఖర్ కూడా బీద సినీ కళాకారులకు కావాల్సిన సరుకులు అందించారు. మరోవైపు దర్శకుడు వినాయక్ కూడా తెలుగు సినీ ఇండస్డ్రీకి రూ.5 లక్షల విరాళం అందజేసారు. మరోవైపు దక్షిణాది సినీ కళాకారులను ఆదుకోవడానికి రజినీకాంత్, కమల్ హాసన్, అర్జున్, సూర్య,విజయ్ సేతుపతి వంటి పలువురు నటులు తమ వంతు ఆర్ధిక సాయం అందజేస్తున్న సంగతి తెలిసిందే కదా.

First published: March 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు