హైదరాబాద్‌లో కరోనా.. క్షమాపణలు చెప్పిన ఛార్మి

ర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో హీరోయిన్ ఛార్మి చేసిన టిక్ టాక్ వీడియోపై దుమారం రేగుతోంది. 'కరోనా హైదరాబాద్‌కు వచ్చిందట..ఆల్ ది బెస్ట్ గయ్స్' అంటూ నవ్వుతూ టిక్ టాక్ వీడియో చేసింది. దానిపై తీవ్ర విమర్శలు రావడంతో ఛార్మి దిగొచ్చింది.

news18-telugu
Updated: March 3, 2020, 9:56 AM IST
హైదరాబాద్‌లో కరోనా.. క్షమాపణలు చెప్పిన ఛార్మి
Image : Charmy Kaur / Facebook)
  • Share this:
హైదరాబాద్‌లో కరోనావైరస్ పాజిటివ్ కేసు నమోదు కావడంతో రాష్ట్ర ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అటు ప్రభుత్వం అప్రత్తమమై వ్యాధిని ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో హీరోయిన్ ఛార్మి చేసిన టిక్ టాక్ వీడియోపై దుమారం రేగుతోంది. 'కరోనా హైదరాబాద్‌కు వచ్చిందట..ఆల్ ది బెస్ట్ గయ్స్' అంటూ నవ్వుతూ ఛార్మి టిక్ టాక్ వీడియో చేసింది. దానిపై తీవ్ర విమర్శలు రావడంతో ఎట్టకేలకు దిగొచ్చింది. ఆ వీడియో చేసినందుకు క్షమాపణ చెబుతున్నట్లు ట్వీట్ చేసింది ఛార్మి.

మీరు చేసిన కామెంట్స్‌ అన్నీ చదివాను. ఆ వీడియో చేసినందుకు క్షమాపణలు చెబుతున్నా. చాలా సున్నితమైన అంశంపై అపరిపక్వత, అవగాహనాలేమితో అలా మాట్లాడాను. ఇకపై ఇలాంటి అంశాల పట్ల జాగ్రత్తగా ఉంటాను. ఇలాంటివి భవిష్యత్‌లో పునరావృతం కావు.
ఛార్మి




యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్-19 (కరోనావైరస్) తెలంగాణకు పాకింది. 24 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు కరోనా సోకడంతో హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో ఐసోలేటెడ్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం కంపెనీ పనిమీద దుబాయ్‌ వెళ్లిన బాధితుడు.. అక్కడ హాంగ్‌కాంగ్‌కు చెందిన వారితో పనిచేశాడు. ఇటీవలే బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు బస్సులో వచ్చిన అతడిని కరోనా సోకినట్లు సోమవారం డాక్టర్లు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది.

Published by: Shiva Kumar Addula
First published: March 2, 2020, 10:34 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading