Home /News /coronavirus-latest-news /

TODAY LAST DATE TO YSR VAHANA MITRA WHO WANT 10000 RS FROM GOVERNMENT THEY APPLY TO DAY ONLY NGS

YSR Vahana Mithra: ఏపీ ప్రభుత్వం నుంచి 10వేల లబ్ధి పొందాలా..? అప్లై చేయండిలా.. ఈ రోజే ఆఖరు

అదిరిపోయే బిజినెస్ ఐడియా (image credit - twitter)

అదిరిపోయే బిజినెస్ ఐడియా (image credit - twitter)

ఏపీలో పది వేల రూపాయలు లబ్ధి పొందేందుకు మరికొన్ని గంటలే గడువు ఉంది. మీరు లబ్ధి దారుల జాబితాలో ఉన్నట్టైతే ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేయండి.. నిన్నటితోనే గడువు ముగిసినా సర్వర్ సమస్యలతో నేటి రాత్రి వరకు గడువు ఇచ్చారు..

    కరోనా కష్ట కాలంలోనూ ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు కొనసాగిస్తోంది. ముఖ్యంగా మేనిఫెస్టోలో హామీలతో పాటు.. పాదయాత్రలో ఆయన ఇచ్చిన హామీలను నెరవేర్చుకునే దిశగా సీఎం జగన్ పట్టుదలతో ఉన్నారు. అందుకే సంక్షేమ పథకాలను ఎక్కడా నిలిపివేయడం లేదు. క్రమం తప్పుకుండా పేదల అకౌంట్లో నగదు వేస్తూనే ఉన్నారు. ఇక ఏపీ ప్రభుత్వం డ్రైవర్ల కోసం తీసుకొచ్చిన పథకం వాహనమిత్ర. ఈ స్కీమ్ కింద ప్రభుత్వం అర్హులైన ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు రూ.10వేల ఆర్థిక సాయం అందిస్తోంది. అయితే ఈ పథకం పొందడానికి కొన్ని కండిషన్లు ఉన్నాయి. దానికి తోడు ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. అర్హులు ఎవరైనా మిగిలి ఉంటే త్వరగా అప్లై చేసుకుంటే మంచింది. లేదంటే పదివేల రూపాయలు మిస్ చేసుకున్నవారు అవుతారు. సర్వర్ సమస్యల కారణంగా నేటి రాత్రి వరకు గడువు పొడిగించారు. అందుకే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వాహనమిత్ర కోసం అప్లై చేసుకోండి..

    ఏపీ ప్రభుత్వం డ్రైవర్ల కోసం తీసుకొచ్చిన పథకం వాహనమిత్ర. ఈ స్కీమ్ కింద ప్రభుత్వం అర్హులైన ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు రూ.10వేల ఆర్థిక సాయం చేస్తూ వస్తోంది. అయితే ఈ స్కీమ్ కి సంబంధించి దరఖాస్తు గడువును ప్రభుత్వం పొడిగించింది. వాస్తవానికి మంగళవారంతోనే గడువు ముగిసింది. అయితే సర్వర్ లో టెక్నికల్ ప్రాబ్లమ్ వల్ల ఇవాళ కూడా దరఖాస్తుకు అవకాశం కల్పించారు. సమయాన్ని కూడా పెంచారు. దీంతో నేటి రాత్రి వరకు ఎవరైనా దీనికోసం అప్లై చేసుకోవచ్చు. అర్హులు ఆలస్యం చేయకుండా వాహన మిత్ర కోసం ఇవాళ కూడా అప్లయ్ చేసుకోవచ్చు. అర్హులైన వారు వాహనం ఫొటోతో వాలంటీర్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

    ఇదీ చదవండి: రేపు ఢిల్లీకి సీఎం జగన్... అమిత్ షా అపాయింట్ ఫిక్స్..! చర్చించే అంశాలు ఇవే

    కరోనాతో ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా గతేడాది కంటే ఈ సారి నెల ముందే ఆర్థిక సాయం అందనుంది. కొత్తగా వాహనాలు కొన్నవారు కూడా ప్రభుత్వం అందించే ఆర్థిక సాయం కోసం ఇవాళ రాత్రి లోపు దరఖాస్తు చేసుకోవాలి. అధికారులు విచారణ పూర్తి చేసి అర్హులైన వారికి 10 వేల రూపాయల సాయం అందిస్తారు. అయితే దీనికి కొన్న కండిషన్లు ఉన్నాయి.. ముఖ్యంగా వేరొక పథకంలో లబ్ది పొందుతున్న వారు, ప్రభుత్వ పించన్ పొందుతున్న వారు ఈ స్కీమ్ కి అనర్హులు. ప్రభుత్వ ఉద్యోగి కుటుంబం సహా ఆదాయ పన్ను చెల్లిస్తున్న వారు కూడా పథకానికి అనర్హులు. ఇప్పటికే లబ్ది పొందిన వారు తిరిగి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. జాబితాలో పేరున్న వారు వారి ఆటో, ట్యాక్సీతో ఫొటో దిగి వాలంటీర్ ద్వారా అప్ లోడ్ చేయాలి. ఈ నెల 15న సీఎం జగన్ వాహనమిత్ర పథకం లబ్ధిదారుల ఖాతాల్లో ఆర్థిక సాయాన్ని జమ చేస్తారు.

    ఇదీ చదవండి: ఏపీలో పది, ఇంటర్ పరీక్షల రద్దు..! స్పష్టత ఇచ్చిన ఏపీ మంత్రి

    వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం అర్హుల జాబితాలను గ్రామ, వార్డు సచివాలయాలు, రవాణా శాఖ ఉప కమిషనర్‌ కార్యాలయాల దగ్గర ప్రదర్శించారు. ఇప్పటికే అర్హులు, కొత్త వాహనాలు కొనుగోలుదారులు, యాజమాన్య హక్కులు బదిలీ అయిన వారి వివరాలు ఈ జాబితాలో ఉంటాయి.
    Published by:Nagesh Paina
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Ap government, AP News, Ap welfare schemes, YSR vahana mitra

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు