ఆ మైసూర్ పాక్‌తో కరోనా తగ్గుతుందని ప్రచారం.. స్వీట్ షాప్‌కు సీల్

తాము తయారుచేసిన హెర్బల్ మైసూర్ పాక్ తింటే కరోనా తగ్గుతుందని ప్రచారం చేశాడు. ఔషధ మూలికలను ఉపయోగించి సిద్ద నిపుణులు వీటిని తయారుచేశారని.. ఈ మైసూర్ పాక్ తింటే ఒక్కరోజులోనే కరోనా ఖతం అవుతుందని చెప్పాడు.

news18-telugu
Updated: July 9, 2020, 9:31 AM IST
ఆ మైసూర్ పాక్‌తో కరోనా తగ్గుతుందని ప్రచారం.. స్వీట్ షాప్‌కు సీల్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనాకు ఇప్పటి వరకైతే మందు లేదు. రెమడిసివిర్, ఫావిపిరవిర్, హైడ్రాక్సిక్లోరోక్విన్, డెక్సా మెథాసోన్ వంటి మందులతో సత్ఫలితాలు వస్తున్నప్పటికీ.. అవి కరోనాను పూర్తి స్థాయిలో తరిమికొట్టే ఔషధాలు మాత్రం కావు. ఇక కరోనా రాకుండా అడ్డుకునే వాక్సిన్ కూడా ఇప్పటి వరకు అందుబాటులోకి రాలేదు. వాటి కోసం శాస్త్రవేత్తలు అహర్నిశలు కృషి చేస్తున్నారు. కానీ కొందరు మాత్రం కరోనా ముందు పేరుతో తప్పుడు ప్రచారం చేసి.. జనాల్లోని ఆందోళనను క్యాష్ చేసుకుంటున్నారు. తాజాగా తమిళనాడులోని ఓ స్వీట్ షాప్.. తాము తయారుచేసిన హెర్బల్ మైసూర్ పాక్ తింటే కరోనాకు చెక్ పెట్టవచ్చని ప్రచారం చేసి.. అడ్డంగా బుక్కయింది.


శ్రీరామ్ అనే 45 ఏళ్ల వ్యక్తి'నెల్లయ్ లాలా స్వీట్స్' పేరుతో కోయంబత్తూరులో ఎనిమిది షాపులు నిర్వహిస్తున్నాడు. తమిళనాడులో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దాన్ని క్యాష్ చేసుకునేందుకు ప్లాన్ చేశాడు. తాము తయారుచేసిన హెర్బల్ మైసూర్ పాక్ తింటే కరోనా తగ్గుతుందని ప్రచారం చేశాడు. ఔషధ మూలికలను ఉపయోగించి సిద్ద నిపుణులు వీటిని తయారుచేశారని.. ఈ మైసూర్ పాక్ తింటే ఒక్కరోజులోనే కరోనా ఖతం అవుతుందని చెప్పాడు. ఆ ప్రచారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

నెల్లయ్ లాలా స్వీట్స్ ప్రచారంతో ఆ షాపుకు జనాలు క్యూకట్టారు. దాంతో తమ మైసూర్ పాక్ బాగా పనిచేస్తోందని భావించిన శ్రీరామ్.. ఏకంగా కేంద్ర ప్రభుత్వానికే ఆఫర్ ఇచ్చారు. తమ హెర్బల్ మైసూర్ పాక్ ఫార్ములాను కేంద్రానికి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. దాంతో తమిళనాడు వైద్యఆరోగ్యశాఖ, ఫుడ్ సేప్టీ అధికారులు రంగంలోకి దిగి.. స్వీట్ గురించి ఎంక్వైరీ చేశారు. ఆ ప్రచారమంతా బూటకమని, ప్రజల్లో ఉన్న భయాన్ని క్యాష్ చేసుకునేందుకే తప్పుడు ప్రకటన చేశారని స్పష్టం చేశారు. హెర్బల్ మైసూర్ పాక్‌ని తయారుచేసే చిన్నియంపాళ్యంలోని నెల్లయ్ లాలా స్వీట్ షాప్‌ను సీల్ చేశారు. ఇలాంటి ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని సూచించారు.
Published by: Shiva Kumar Addula
First published: July 9, 2020, 9:31 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading