Andhra Pradesh: కళ్లముందే పోయిన రెండు ప్రాణాలు... ఆక్సిజన్ కొరతకు ఇదే నిదర్శనం..

ప్రతీకాత్మక చిత్రం

ఆక్సిజన్ కొరత (Oxygen Crisis) కరోనా రోగుల (Corona Patients) ప్రాణాలు తీస్తోంది. దీనికి కొందరు డాక్టర్ల నిర్లక్ష్యం తోడవడంతో ప్రాణనష్టం సంభవిస్తోంది.

 • Share this:
  ఆంధ్రప్రదేశ్ లో కరోనా విలయతాండవం సృష్టిస్తోంది. వైరస్ తీవ్రరూపం దాల్చి పదులకొద్దీ ప్రాణాలు పోతుంటే.. సరైన సమయంలో ఆక్సిజన్ అందక.. కోలుకునే అవకాశమున్నవారు కూడా ఊపిరి వదిలేస్తున్నారు. ఇందులో కొంత దురదృష్టం ఉంటే.. మరికొంత డాక్టర్ల నిర్లక్ష్యం కూడా కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అలాంటి నిర్లక్ష్యమే రెండు నిండు ప్రాణాలను బలితీసుకుంది. కడప జిల్లా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక కోవిడ్ పేషెంట్లు తెల్లవారుజామున విలవిలలాడారు. సకాలంలో డాక్టర్లకు సమాచారం అందించినా.. నిర్లక్ష్యం వహించడంతో పేషెంట్లను ఇతర ఆస్పత్రులకు తరలించే ప్రయర్నంలోనే ప్రాణాలు విడిచిన సంఘటన వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రిలో చోటు చేసుకుంది. కరోన రోగులకు ఆక్సిజన్ అందించడంలో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని స్వయానా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన కొద్ది గంటలకే ఇలాంటి సంఘటన చోటుచేసుకోవడం చర్చనీయాంశమైంది. ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రిని కోవిడ్ ఆస్పత్రిగా అధికారులు నిర్ధారించిన తర్వాత అక్కడ పేషెంట్లకు కావలసిన సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు సూపరిండెంట్ లక్ష్మీ ప్రసాద్ తెలిపారు.

  అయితే పేషెంట్లకు కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదని వ్యాధి గ్రస్తుల తోపాటు, వారి బంధువులు ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగానే సోమవారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయింది. అప్పటికే పేషెంట్లు విలవిలలాడుతున్నారు. వారి బంధువులు వెళ్లి ఆక్సిజన్ సరఫరా కావడం లేదని తెలపడంతో అక్కడ పనిచేస్తున్న నర్సులు ఆక్సిజన్ సరఫరాలో సమస్య ఏర్పడిందని వెంటనే పేషెంట్లను వేరే ఆస్పత్రికి తీసుకుని వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు.

  ఇది చదవండి: సంగం డెయిరీపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ధూళిపాళ్ల నరేంద్రకు ఊహించని షాక్


  వారు అంబులెన్సులు పిలిచి తరలించే ప్రయత్నం చేసేలోపే ఇద్దరు మృతి చెందారు. మైదుకూరు నియోజకవర్గం చాపాడు మండలానికి చెందిన మహిళతో పాటు, ప్రొద్దుటూరు పట్టణం ఆశ్రమం వీధిలో ఉంటున్న మరో వ్యక్తి ఆక్సిజన్ అందక మృతి చెందారు. మరికొందరు విషమ పరిస్థితిలో ఉన్న విషయాన్ని కూడా బయటికి రానీయకుండా సూపరింటెండెంట్ లక్ష్మీప్రసాద్ అక్కడ సిబ్బందిని బెదిరించినట్లు తెలుస్తోంది. దీంతో విషయాన్ని ఎవరూ బయటికి చెప్పలేదు.

  ఇది చదవండి: ఏపీలో లాక్ డౌన్... ఉదయం 9గంటల వరకే షాపులు... ఎక్కడో తెలుసా..?


  ఇదిలా ఉంటే మంగళవారం ఉదయం కొందరు బాధితులు మీడియాకు సమాచారం ఇచ్చారు. మీడియా అక్కడికి వెళ్లి పరిస్థితిని పరిశీలిస్తే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఆక్సిజన్ పరిశీలించేందుకు ప్రత్యేక సిబ్బందిని ఇటీవలే నియమించుకున్నా వారు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో నే ఆక్సిజన్ అందక ఇద్దరు పేషంట్లు మరణించిన సంఘటన జరిగింది. దీనిపై జాయింట్ కలెక్టర్ కు కూడా సూపరింటెండెంట్ తప్పుడు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఘటనపై డీ.ఆర్.డి.ఎ మురళి మోహన్ , జిల్లా వైద్య అధికారులు జిల్లా ఆస్పత్రిలో విచారణ జరుపుతున్నారు. సీఎం సొంత జిల్లాలోనే పరిస్థితి ఇలా ఉంటే మిగిలిన ప్రాంతాల్లో ఎంత దారుణంగా ఉంటుందో అని మృతుల బంధువులు ప్రశ్నిస్తున్నారు. సకాలంలో ఆక్సిజన్ అందించకపోవడమే కాకుండా.. ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించిన సూపరిండెంట్ ను సస్పెండ్ చేయాలని బాధిత బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
  Published by:Purna Chandra
  First published: