Andhra Pradesh: పేరుకు పెద్ద సాఫ్ట్ వేర్ ఇంజనీర్.. కానీ ఆస్తి కోసం అంత పని చేశాడు..

Andhra Pradesh: పేరుకు పెద్ద సాఫ్ట్ వేర్ ఇంజనీర్.. కానీ ఆస్తి కోసం అంత పని చేశాడు..

ఆస్తి కోసం తల్లిదండ్రులను బయటకు నెట్టిన కొడుకు

ఉన్నత కొలువులో ఉన్నాడు.. కానీ మనిషి అన్న సంగతి మరిచిపోయాడు.  ఆస్తిపై ఆశతో పెంచి పెద్ద చేసిన కన్న తల్లి దండ్రులను బయటకు గెంటేశాడు. కన్నవారు అని చూడకుండా కర్కశంగా ప్రవర్తించాడు.

  • Share this:
    GT Hemanth Kumar, Tirupati Correspondent, News18

    పిల్లలకు మొదటి దైవం తల్లిదండ్రులే... పిల్లల భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమించి, భవితకు పునాదులు వేసిన తల్లిదండ్రులు ఏం చేసినా రుణం తీర్చుకోలేం. కానీ కొందరి కొడుకులకు కని పెంచిన తల్లిదండ్రులు భారమవుతున్నారు. తాజాగా చిత్తూరు జిల్లా పుంగనూరులో తల్లి తండ్రుల ఆస్తి దక్కించుకుని.. బలవంతంగా వారిని బయటకు పంపేశాడు కన్నకొడుకు. ఈ వయసులో ఎక్కడ ఉంటాం.. ఏం చేస్తామని వేడుకున్నా కరుణించలేదు. ఇంటి నుంచి బయటకు వెళ్లకపోతే పొడిచేస్తాను అంటూ కత్తితో బెదిరించాడు. కనిపెంచిన వారికంటే..  వారు సంపాదించిన కాసులే తనకు ముఖ్యం అనుకున్నాడు. దీంతో ఏం చేయలేక.. దిక్కుతోచని స్థితిలో వీధిన పడ్డారు వృద్ధ దంపతులు.

    స్థానికులు చెప్పిన వివరాల ప్రరకారం పుంగనూరు మండలం నెక్కుంది పంచాయితీ ఇటిక నెల్లూరు గ్రామంలో నివాసముండే వెంకట్రామణ రెడ్డి శ్యామలమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. కాయకష్టం చేసుకొని పిల్లలను చదివిస్తూ సొంత ఇల్లు కట్టుకొని వ్యవసాయం చేసుకొని జీవిస్తున్నారు. మొదట కుమారుడు  కృపాకరరెడ్డి  పెద్ద చదువులు చదివి  హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. రెండో కుమారుడు సరైన చదువు లేక ట్రాక్టర్ టెంపో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు.

    పెద్ద కుమారుడికి తోడు నీడా కావాలని భావించి.. పెళ్లి చేసి హైదరాబాద్ లోనే కాపురం పెట్టించారు. ఇటివల కరోన లాక్ డౌన్ ప్రభావంతో హైదరాబాద్ లో పనిచేస్తున్న కృపాకర రెడ్డి ఇరవై రోజుల కిందట వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ.. భార్యతో కలిసి సొంత గ్రామం వచ్చేశాడు. అయితే ఇరవై రోజులు కిందట ఫోన్ చేసి.. గ్రామానికి వచ్చి 20 రోజులు ఉంటానని చెప్పాడని.. కానీ వచ్చినప్పటి నుంచి ఆస్తి తన పేరుపై రాయాలి అంటూ గొడవ పుడుతున్నాడని ఆ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ ఉదయం ఆస్తి విషయంలో పెద్దగా గొడవపడి ఇంటి నుండి బయటకు వెళ్ళమని బలవంతంగా తమను బయటకు నెట్టేశాడంటూ కన్నీరు పెడుతున్నారు. అందుకే ఒప్పుకోమని చెబితే.. కత్తితో బెదరించాడన్నారు. అయితే ఎక్కడ చంపేస్తాడో అనే ప్రాణభయంతో బయటకు వచ్చామంటున్నారు.

    పెద్ద కుమారుడికి భయపడిన ఇంటి నుంచి బయటకు వచ్చేసామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ  పెద్ద కుమారుడు కృపాకరరెడ్డి రెడ్డి కారణంగా తమకు  ప్రాణహాని ఉందంటున్నారు. తమకు న్యాయం చేయాలి అంటూ  పుంగనూరు పోలీసులను ఆశ్రయించారు. ఇప్పుడు బయట ఏదో పని చేసుకుని బతుకుదామన్నా తమకు శక్తి లేదని..  ప్రేమగా పెంచిన కొడుకే ఇప్పుడు రోడ్డుపాలు చేయడంతో కన్నీరు మున్నీరు అవుతున్నారు ఆ వృద్ద దంపతులు. పోషించే శక్తి ఉన్న పెద్ద కుమారుడు బయట తరిమేయడం.. కాయ కష్టం చేసిన అమ్మ నాన్నలను కాపాడే శక్తి లేని చిన్న కుమారుడు ఉంటడంతో వారు దిక్కులేక రోడ్డున పడ్డారు. 
    Published by:Nagesh Paina
    First published: