హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

Andhra Pradesh: భయపెడుతున్న బ్లాక్ ఫంగస్.. కోవిడ్ ఆస్పత్రిలో మహిళ బలన్మరణం

Andhra Pradesh: భయపెడుతున్న బ్లాక్ ఫంగస్.. కోవిడ్ ఆస్పత్రిలో మహిళ బలన్మరణం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కరోనా కాటేస్తోంది. బ్లాక్ ఫంగస్ భయపెడుతోంది. ఏపీలో కఠిన కర్ఫ్యూ కారణంగా కేసులు తగ్గాయని ఊరట పొందే పరిస్థితి లేకుండా చేస్తున్నాయి ఈ మరణాలు. కొందరు భయంతోనే బలన్మరణానికి పాల్పడడం ఆందోళన పెంచుతోంది. అయితే పద్మావతి కోవిడ్ సెంటర్ లో సరైన వైద్య సదుపాయాలు లేకే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని రోగుల బంధువులు ఆందోళన చెందుతున్నారు.

ఇంకా చదవండి ...

ఏపీని కరోనా వైరస్ వెంటాడుతోంది దీనికి తోడు బ్లాక్ ఫంగస్ భయపెడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా కఠినంగా కర్ఫ్యూ అమలు చేస్తున్నా 8 వేలకు పైగా కేసులు నమోదువుతూనే ఉన్నాయి. అయితే కోరానా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య కాస్త ఊరట కలిగిస్తున్నా.. బ్లాక్ ఫంగస్ భయం మాత్రం వెంటాడుతోంది. ముఖ్యంగా సరైన చికిత్స లేకపోవడం.. ఆస్పత్రిలో ఇస్తున్న బిల్లులు భరించలేని పరిస్థితి ఉండడంతో బ్లాక్ ఫంగస్ అంటేనే ప్రజలు భయపడుతున్నారు. కొందరైతే ఆ భయంతో ప్రాణాలను కూడా తీసుకుంటున్నారు. తాజాగా తిరుపతిలోని స్విమ్స్‌ పద్మావతి రాష్ట్ర కొవిడ్‌ ఆస్పత్రిలో ఒ మహిళ రోగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆస్పత్రి మెడిసిన్‌ వార్డులో ఉరేసుకుని జయమ్మ అనే రోగి మృతిచెందారు. నెల్లూరు జిల్లాలో నర్సుగా విధులు నిర్వర్తిస్తున్న ఆమెకు బ్లాక్‌ ఫంగస్‌ సోకడంతో స్విమ్స్‌లో చేరి చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో జయమ్మ బలవన్మరణానికి పాల్పడ్డారు.

మరోవైపు అదే ఆస్పత్రిలో ఉదయం చిత్తూరు జిల్లా కలికిరికి చెందిన ఓ యువకుడు మృతిచెందాడు. సరైన వైద్యం అందకే యువకుడు మృతిచెందాడంటూ అతడి తరఫు బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. పోలీసులు కలుగజేసుకుని వారి సర్ది చెప్పారు. ఒకరు ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా కారణంగా మరణిస్తే.. మరొకరు భయంతో ఆత్మహత్య చేసుకున్నారు. గంటల వ్యవధిలో ఒక ఆస్పత్రిలో రెండు ఘటనలు జరగడంతో తిరుపతిలో విషాద చాయలు అలముకున్నాయి.

పద్మావతి స్టేట్ కోవిడ్ ఆస్పత్రిలో ఆత్మహత్య చేసుకున్న జయమ్మది నెల్లూరు.. బ్యాంకర్స్ కాలనీకి చెందిన జయమ్మనెల్లూరు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్స్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఆత్మహత్య ఘటనపై

జయమ్మ బంధువులను ఆర్ డి ఓ కనక నర్సారెడ్డి విచారించారు. అయితే మే 4 న ఆమెకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యిందని..

మే 13 న నెగిటివ్ రిపోర్ట్ వచ్చిందని బంధువులు చెప్పారు. అయితే తరువాత బ్లాక్ ఫంగస్ లక్షణాలతో ఆస్పత్రిలో జాయిన్ చేయాల్సి వచ్చిందని.. జూన్ 10 నా బ్లాక్ ఫంగస్ కు సంబంధించి శస్త్ర చికిత్స జరిగిగింది అన్నారు. ఆమె కోలుకుంటోందని అంతా భావిస్తున్న సమయంలో తెల్లవారుజామున నాలుగు గంటల సమీపంలో విపరీతమైన నొప్పితో కేకలు వేసిన ఆమ.. బలవన్మరణానికి పాల్పడిందని ఆర్ డి ఓ వెల్లడించారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి రుయా ఆస్పత్రి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరోవైపు పద్మావతి ఆస్పత్రిలో చికిత్స తీరుపై నిరసనలు మిన్నంటుతున్నాయి.  కోవిడ్, బ్లాక్ పంగస్ రోగులకు సైరైన  వైద్యం అందడం లేదని వారి బంధువులు ఆందోళనకు దిగారు.  ఈ ఘటనలపై చిత్తూరు జిల్లా డీఎంహెచ్ఓ డాక్టర్ శ్రీహరి, హాస్పిటల్  మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ తో రాష్ట్రం వైద్య ఆరోగ్య శాఖమంత్రి ఆళ్ల నాని ఫోన్ లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే రోగులు అందరికీ మెరుగైన వైద్యం అందేలా చూడాలిన ఆదేశాలు జారీ చేశారు.

ఆక్సిజన్ లెవన్స్ 36 ఉండడంతో వెంటిలీటర్ పై వినోద్ కు వైద్యం అందించారు. కానీ వైద్యుల ప్రయత్నం ఫలించలేదు. దీతో ఇవాళ ఉదయం వినోద్ మరణించాడు. అయితే అతడి మరణానికి వైద్యులు, సిబ్బందతి నిర్లక్ష్యమే కారణంమంటున్నారు స్థానికులు, ఇక బ్లాక్ ఫంగస్ తో ఇబ్బంది పడుతున్న జయమ్మకు మెరుగైన వైద్యం అందించినా మరణించారని వైద్యులు చెబుతున్నారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Black Fungus, Cirme, Tirupati

ఉత్తమ కథలు