హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

Corona Virus: అసలే కరోనా.. ఆపై ఆకలి కేకలు.. కొవిడ్ కేర్ సెంటర్లలో రోగుల పాట్లు

Corona Virus: అసలే కరోనా.. ఆపై ఆకలి కేకలు.. కొవిడ్ కేర్ సెంటర్లలో రోగుల పాట్లు

ఏపీలో కరోనా రోగుల ఆకలి కేకలు

ఏపీలో కరోనా రోగుల ఆకలి కేకలు

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఓ వైపు కరోనా వైరస్ (Corona Virus) విజృంభిస్తుంటే మరోవైపు రోగులకు సరైన ఆహారం లేక ఆకలితో అలమటించిపోతున్నారు.

కోవిడ్-19 మొదటి వేవ్ కన్నా రెండో వేవ్ లో తీవ్రంగా వ్యాప్తి చెందుతోంది. రోజురోజుకు వేల సంఖ్యలో ప్రజలు కరోనా బారిన పడి ఆసుపత్రి పాలు అవుతున్నారు. అయితే కరోనా సోకినా వ్యక్తులకు ముఖ్యంగా పౌష్ఠిక ఆహారం తీసుకోవడం ద్వారా కరోనా వ్యాధి నుంచి తప్పుకోవచ్చని వైద్యులు, ప్రపంచ ఆరోగ్య సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. క్వారంటైన్ లో ఉన్న ప్రజలకు పౌష్ఠిక ఆహారం అందించేందుకు ప్రభుత్వం కాంట్రాక్టర్ లను నియమించి నాణ్యమైన భోజల వసతులు కల్పిస్తోంది. అయితే కాంట్రాక్టర్లు నాణ్యమైన భోజనాలు అందించడం ఏమో కానీ...క్వారంటైన్ లో చికిత్స చేయించుకుంటున్న వారి ఆకలి కేకలు కనిపిస్తున్నాయి. ఆదివారం కరోనా రోగులు ఆకలితో అలమటించారు. అదిగో... ఇదిగో తెస్తారన్న ఆశతో రోజంతా ఎదురు చూశారు. ఉదయం అల్పాహారం... మధ్యాహ్న భోజనం పంపిణీ చేయకపోవడంతో ఖాళీ కడుపులతో విలవిల్లాడారు. ప్రైవేట్ గా ఏదొక ఆహారాన్ని తెప్పించుకోడానికి కూడా వీలులేని దయనీయ పరిస్థితి వారిది. అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి, సూపర్ స్పెషాలిటీ, క్యాన్సర్ ఆస్పత్రుల్లో కొవిడ్తో వైద్య చికిత్స పొందుతున్న 440 మంది రోగుల హృదయ విదారకమైన దుస్థితి ఇది.

అధికారుల అలసత్వం, కాంట్రాక్టర్ నిర్వాకం మూలంగా కరోనా రోగులు కడుపు మార్చుకోవాల్సి వచ్చింది. అసలు ఏం జరిగిందంటే..., సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో 275 మంది, సర్వజనలో 80, క్యాన్సర్ ఆస్పత్రిలో 85 మంది చొప్పున చికిత్స పొందుతున్నారు. వీరికి మూడు పూటలా అల్పాహారం, భోజనం, మధ్యలో స్నాక్స్... వంటి ఆహారాన్ని అందించే బాధ్యత ఏపీ పర్యాటక శాఖ జిల్లా అధికారులు తీసుకున్నారు. ఈ శాఖ యంత్రాంగం ఉప గుత్తేదారుడికి అప్పగిం చారు. తొలి దశ నుంచి ఆ శాఖకు అప్పగించారు. ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో అరకొర పొంగల్ ప్యాక్ చేసిన ఓ ఇరవై మందికి అల్పాహారం ఇచ్చారు. మిగతా వారికి ఇవ్వలేదు. ఇక భోజనం పూర్తిగా ఇవ్వలేదు. అన్నిచోట్లా ఇదే దుస్థితి నెల కొంది.

ఆదివారం ట్రైనీ కలెక్టర్ సూర్య తేజ క్యాన్సర్ ఆస్పత్రి, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను పరిశీలించారు. ఈ క్రమంలో అల్పాహారం, భోజనం పెట్టలేదంటూ రోగులు మొర పెట్టుకున్నారు. టిఫిన్ పెట్టలేదు. భోజనం తేలేదు. తామంతా ఆకలితో ఇబ్బంది పడుతున్నామంటూ కంటతడి పెట్టుకున్నారు. దీంతో ఆయన ఆరా తీశారు. సాయంత్రం 4 గంటలకు కొంత మందికి హోటళ్ల నుంచి భోజన ప్యాకెట్లు తీసుకొచ్చారు. ఈ ప్యాకెట్లు సైతం అపరిశుభ్రతతో ఉన్నాయి. కొన్ని ప్యాకెట్లలో దోమలు, ఈగలు కనిపించాయి. విధిలేక ఆకలి తట్టుకోలేక అదే భోజనాన్ని తిన్నారు.


ఇక కడపలోని హజ్ హౌస్ కోవిడ్ కేంద్రంలోను బాధితులు పరిస్థి దయనీయంగా మారింది. వందల సంఖ్యలో కరోనా బాధితులు ఉన్న ప్రాంతంలో సరైన వసతులు లేక...కరోనాకు వైద్యం అందించే వారు లేక దీన స్థితిలో ఉన్నారు కరోనా భారిన పడ్డ ప్రజలు. కరోనా నిర్ధారణ అయిన తరువాత ఫాతిమా కోవిడ్ సెంటర్ నుంచి నేరుగా హజ్ హౌస్ కి తరలించి తాళాలు వేశారని, కనీసం మాత్రలు కూడా ఇచ్చే నాధుడే లేదని అవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి 10 గంటలకు నాణ్యత లేని ఆహారాన్ని అందించినా అవి ఏమాత్రం మాకు సరిపోవడం లేదని సెల్ఫీ వీడియోలో బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. రాత్రంతా, తీవ్ర దగ్గు, జ్వరంతోనే బాధపడుతూ ఉన్నామని కనీసం వైద్యం అందించే వారు లేరని కన్నీరు పెట్టుకున్నాడు. ఇకనైమ సంబంధిత అధికారులు చొరవ చూపి కరోనా సోకి క్వారంటైన్ లో చికిత్స పొందుతున్న వారికీ నాణ్యమైన భోజనం సమయానికి అందించేలా చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుకుంటున్నారు.

First published:

Tags: Andhra Pradesh, Corona virus, Covid hospital

ఉత్తమ కథలు