Home /News /coronavirus-latest-news /

TIRUPATI CORONA CASES INCREASING IN CHITTOOR DISTRICT AS DELAY OF TEST RESULTS IS THE REASON BEHIND THIS FULL DETAILS HERE PRN TPT

Covit-19 Test Reports: ఏపీలో కొవిడ్ వ్యాప్తిది ఇదే ప్రధాన కారణమా..? తప్పు ఎక్కడ జరుగుతోంది..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కొవిడ్ లక్షణాలను (Covid-19 Symptoms) గుర్తించిన వెంటనే టెస్టులు చేయడం అత్యవసరం. ఐతే రిపోర్ట్స్ ఆలస్యం కావడంతో వైరస్ మరింత విజృంభిస్తోంది.

    దేశవ్యాప్తంగా అందరిలోనూ పెరుగుతున్న కోవిడ్ నిర్ధారణ సంఖ్యా రోజు రోజుకు పెరుగుతూ ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటు ఆంధ్రప్రదేశ్ లోనూ సెకండ్ వేవ్ తీవ్ర తరం కావడంతో కేసులు మరింత పెరుగుతూ.., కరోనా తన రూపం మార్చుకొని మరింత బలంగా ప్రజలపై పంజా విసురుతోంది. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది. దీంతో కరోనా నిర్ధారణ అయిన వారితో పాటుగా ప్రైమరీ సెకండరీ కంటాక్స్ కు అధిక సంఖ్యలో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. వ్యాధి లక్షణాలు ఉన్న.., లేకున్నా పరీక్షలు చేస్తుండడంతో జిల్లా వ్యాప్తంగా రోజుకు 2 నుంచి 3 వేలకు శాంపిల్స్ సేకరిస్తున్నారు. స్వాబ్స్ ఇచ్చిన అనుమానితులకు పరీక్షా ఫలితాల కోసం వేలాది మంది ఎదురుచూస్తున్నా పరిస్థితి ఏర్పడుతోంది. అనుమానిత లక్షణాలతో స్వాబ్ ఇచ్చి రోజుల తరబడి ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతానికి స్విమ్స్, రుయా ల్యాబ్లో సుమారు 8 వేల నమూనాలు పెండింగ్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. రెండు రోజుల కిందట స్విమ్స్ 16 వేల స్వాబ్స్ పెండింగ్ లో ఉన్న విషయాన్ని గుర్తించిన జిల్లా కలెక్టరు ఎం హరి నారాయణన్ త్వరగా పరీక్షలు పూర్తి చేయాలని ఆదేశించారు.

    దీంతో రెండు రోజులుగా స్విమ్స్ స్వాబ్స్ సేకరణను నిలిపివేసి పెండింగ్లో ఉన్నవాటిని పరీక్షిస్తున్నారు. జిల్లాలోని PHC, అర్బన్ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆస్పత్రుల నుంచి వచ్చే నమూనాలను తీసుకో లేదని సమాచారం. కేవలం స్విమ్స్ లో నిర్వహించే స్వాబ్స్ ను మాత్రమే టెస్టులో చేస్తున్నట్లు తెలుస్తోంది. బుధవారం రాత్రికి 4 వేల నమూనాలు పెండింగ్ లో ఉన్నట్లు స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ స్పష్టం చేశారు. రుయా ఆసుపత్రి వీఆర్డీ ల్యాబ్లో సుమారు నాలుగు వేలకు పైగా కొవిడ్ నమూనాలు ఉన్నట్లు సమాచారం. జిల్లా నుంచి వందలా దిగా నమూనాలు రుయాకు వస్తున్నాయి.బుధవారం ఉదయానికి 5,800 నమూనాలు పెండింగ్లో ఉండగా మరో వెయ్యి వచ్చి నట్లు సమాచారం.

    ఇది చదవండి: ఏపీలోని మరో నగరంలో నైట్ కర్ఫ్యూ.. రాత్రి 7 గంటలకే అన్నీ బంద్...


    అనుమానిత లక్షణాలతో కొవిడ్ పరీక్షలకు స్వాబ్ ఇచ్చినవారు ఫలితాల కోసం జిల్లా వ్యాప్తంగా ఎదురు చూస్తున్నారు. 24 గంటల్లో కరోనా పరీక్షా ఫలితాలు ప్రకటించడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. అయినా ఆలస్యం తప్పడంలేదు. తిరుపతిలో వారం, పది రోజులుగా ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారు కూడా ఉన్నారు. కిట్ల కొరత కారణంగా ఆలస్యం అవుతున్నట్లు సమాచారం. స్విమ్స్ లో పూర్తి స్థాయిలో పరీక్షలు నిర్వహించలేకపోవడం వల్ల ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది. రుయా ల్యాబ్లో సిబ్బంది కొరత కూడా ఇందుకు మరో కారణం. పరీక్షల తర్వాత ఫలితాలు నమోదు చేసే డేటా ఎంట్రీ సిబ్బంది తక్కువగా ఉన్నట్లుగా సమాచారం. కొవిడ్ పాజిటివ్ ఫలితాలను మాత్రమే అప్ లోడ్ చేస్తున్నారని.., నెగెటివ్ ఫలితం వస్తే ఎంట్రీ వేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ల్యాబ్లో పనిచేసే సిబ్బంది ఇటీవల కొవిడ్ బారిన పడటం వల్ల కూడా డేటా ఎంట్రీ ఆలస్యం అవుతున్న మాట వాస్తవం. ల్యాబ్ నుంచి దూరంగా ఎంట్రీ కార్యాలయాన్ని మార్చను న్నట్లు రుయా సూపరింటెండెంట్ డాక్టర్ భారతి తెలిపారు.

    ఇది చదవండి: కోవిడ్ బాధితుల‌కు గుడ్ న్యూస్.. అతి త‌క్కువ ఖ‌ర్చుతో ట్రీట్ మెంట్...



    జిల్లాలో రోజువారీ బాధితుల సంఖ్య మూడంకెలు దాటి నాలుగు అంకెలకు దగ్గరగా వస్తోంది. రుయా, స్విమ్స్ మినహా నగరంలో స్వాబ్స్ తీయడం లేదు. అర్బన్ హెల్త్ సెంటర్లో కొవిడ్ టీకా వేస్తున్నందున. స్వాబ్స్ సేకరణ ఆపివేశారు. గతంలో బాలాజీ టూరిస్టు బస్టాండు, స్విమ్స్ ఆధ్వ ర్యంలో మరో బస్సు ద్వారా అనుమానితుల నుంచి స్వాబ్స్ సేకరించేవారు. ప్రస్తుతం అలాంటి సదుపాయం లేకపోయింది.

    ఇక రాయలసీమలోను కరోనా విలయ తాండవం చేస్తోంది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో నమోదు కాగా రెండవ స్థానంలో కర్నూలు జిల్లా ఉంది. చిత్తూరు జిల్లాలో గడిచిన 24 గంటల్లో 1,180 మందికి కరోనా నిర్ధారణ కాగా.., మొత్తం కేసుల సంఖ్య 10,3679కి చేరుకుంది. ఇందులో యాక్టివ్ కేసుల సంఖ్య 9,481 ఉండగా.., 930 మంది కరోనాతో మృతి చెందారు. కర్నూలు జిల్లాలోనూ కరోనా కోరలు చాచింది. గడిచిన 24 గంటల్లో 958కేసులు నమోదు కాగా., యాక్టివ్ కేసుల సంఖ్య 5024 ఉంది. కరోనా బారినపడి కోలుకున్న వారి సంఖ్య 62,733కాగా.. మొత్తం కేసుల సంఖ్య 68,275కు చేరుకుంది. ఇందులో 518 మంది కరోనాతో పోరాడి మృతి మృతి చెందారు. అనంతపురం జిల్లాలో కొత్తగా 849 కేసులు నమోదుకాగా.. మొత్తం కరోనా బారినపడిన వారి సంఖ్య 72,733కు చేరుకుంది. ఇందులో 2,498 యాక్టివ్ కేసులు ఉండగా.., 69163మంది కరోనాను జయించారు. మృతుల సంఖ్య 622కు చేరింది. కడప జిల్లాలో కరోనా ప్రభావం తక్కువగా ఉందనే చెప్పుకోవాలి. గడిచిన 24 గంటల్లో 216 కేసులు నమోదు కాగా ఇప్పటివరకు మొత్తం 59,015 మంది కరోనా బారిన పడ్డారు. ఇందులో 57,095మంది కోలుకోగా.., 1,444 మంది చికిత్స పొందుతున్నారు. రాయలసీమలోనే అత్యల్పంగా తక్కువ మరణాలు నమోదు అయిన ప్రాంతం కడప అనే చెప్పుకోవాలి. మొత్తం 476 మంది కరోనాతో పోరాడి మృతి చెందినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Corona virus, Tirupati

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు