news18-telugu
Updated: July 15, 2020, 5:37 PM IST
ప్రతీకాత్మక చిత్రం
తిరుపతి నగరంలో రోజురోజుకూ పెరిగిపోతున్న కరోనా కేసులను కట్టడి చేసేందుకు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఒక పద్దతి ప్రకారం నిర్దేశించుకుని ఆక్సిజన్ లెవెల్స్ సర్వే చేపట్టాలని జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా అధికారులకు సూచించారు. నేటి నుండి ఆక్సో పల్స్ మీటర్ సర్వే నిర్వహించి ఆక్సిజన్ లెవెల్స్ రీడింగ్ 95 లోపు ఉన్నవారిని గుర్తించాలని అన్నారు. అందుకోసం ఏఎన్ఏంలకు అక్సో పల్స్ మీటర్లు అందిస్తున్నామని తెలిపారు. 95 కన్నా రీడింగ్ తక్కువగా వుంటే రక్తంలో ఆక్సిజన్ తక్కువ వున్నట్లు అని, ఆరోగ్య పరిస్థితిని బట్టి అంచనా వేసి అర్బన్ హెల్త్ సెంటర్కు పంపి పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ భరత్ సూచించారు.
స్వాబ్ టెస్టులలో ఆక్సిజన్ లెవెల్స్ 95 శాతం కన్నా తక్కువగా ఉండి నెగిటివ్ వచ్చినా రక్త పరీక్ష , ఎక్స్-రే తీసిన తరువాత వారి ఇంటికి పంపాల్సి ఉంటుందని తెలిపారు. పాజిటివ్ రిసల్ట్ వచ్చిన వారిని వార్డు వారీగా ఒక్క టైమ్ ఫిక్స్ చేసి 10 రోజులకు సరిపడా అతను కావలసిన పుస్తకాలు, తినుబండారాలు, ఇతరత్రా బట్టలు వంటివి తీసుకొని రావాలని సదరు వ్యక్తులకు చెప్పాలని ఆదేశించారు. సమస్య తీవ్రత ఉంటే రుయా ఆసుపత్రికి, తక్కువ ఉంటే శ్రీనివాసం కోవిడ్ కేంద్రాలకు పంపించాలని సూచించారు.
Published by:
Kishore Akkaladevi
First published:
July 15, 2020, 5:37 PM IST