news18-telugu
Updated: April 15, 2020, 10:36 AM IST
కోవిడ్ 19 కారణంగా రూ. 3 వేల కోట్లకుపైనే ఉంటే టీటీడీ వార్షిక బడ్జెట్... రూ. 2 వేల కోట్లకు దిగిరానుంది.
ఏడు కొండల వాడా.. వేంకట రమణ.. గోవిందా.. గోవిందా.. అంటే భక్తుల కోర్కెలు తీర్చే తిరుమల వెంకన్న.. పేదల ఆకలి తీర్చేందుకు సిద్ధమయ్యాడు. కరోనా దెబ్బకు లాక్డౌన్ విధించడంతో చాలా మంది వలస కూలీలు, పేదలు అర్ధాకలితో అలమటిస్తున్నారు. వారి దయనీయ స్థితిని గమనించిన టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ వ్యాప్తంగా తినడానికి తిండి లేకుండా సహాయం కోసం ఎదుతూ చూస్తున్న వారి కోసం రూ.13 కోట్లు విడుదల చేస్తోంది. ఈ మేరకు టీటీడీ ఛైర్మన్ ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించి అన్నప్రసాదం ట్రస్ట్ ద్వారా విరాళం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు ఈవో అనిల్ సింఘాల్ తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు రూ.1 కోటి చొప్పున అందించనున్నట్లు వెల్లడించారు.ప్రతి జిల్లా కలెక్టర్లకు ఈ నిధులు అందచేయనున్నట్లు ఆయన తెలిపారు.
అటు.. లాక్డౌన్ గడువును పొడిగించిన నేపథ్యంలో భక్తులకు శ్రీవారి దర్శనాన్ని మే 3 వరకు నిలిపివేసినట్లు సింఘాల్ తెలిపారు. కాగా, కరోనా వైరస్ కట్టడి కోసం టీటీడీ ఆయుర్వేద మందుల తయారీ చేపట్టింది. ఎస్వీ ఆయుర్వేద కళాశాల, ఎస్వీ ఆయుర్వేద దవాఖాన, ఆయుర్వేద ఫార్మసీ సంయుక్తంగా ఐదు రకాల మందులను తయారు చేస్తున్నాయి. ఆ మందులను టీటీడీ జేఈవో బసంత్‌కుమార్ విడుదల చేశారు. ముందుగా ఈ ఆయుర్వేద మందులను టీటీడీ అన్న ప్రసాదం సిబ్బందికి అందజేశారు. కరోనా నివారణకు ఉపయోగపడే రక్షజ్ఞధూపం, పవిత్ర, గండూషము, నింబనస్యం, అమత మాత్రలను విడతల వారీగా పంపిణీ చేయనున్నట్ల టీటీడీ వెల్లడించింది.
Published by:
Shravan Kumar Bommakanti
First published:
April 15, 2020, 10:35 AM IST