కరోనా కట్టడికి తిరుమలలో ఆయుర్వేద మందుల తయారీ..

కరోనా వైరస్‌ కట్టడి కోసం టీటీడీ ఆయుర్వేద మందుల తయారీ చేపట్టింది. ఎస్వీ ఆయుర్వేద కళాశాల, ఎస్వీ ఆయుర్వేద దవాఖాన, ఆయుర్వేద ఫార్మసీ సంయుక్తంగా ఐదు రకాల మందులను తయారు చేస్తున్నాయి.

news18-telugu
Updated: April 9, 2020, 6:53 AM IST
కరోనా కట్టడికి తిరుమలలో ఆయుర్వేద మందుల తయారీ..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
గోవిందా అంటేనే కోర్కెలు తీర్చే భగవంతుడి సన్నిధి అది.. నిత్యం లక్షలాది మంది భక్తులకు అన్న ప్రసాదాలు తయారు చేసే ప్రాంతం అది.. ఆకలి అంటే కడుపు నిండా అన్నం పెట్టే సత్రం అది.. లడ్డూలు, అన్న ప్రసాదాలు మాత్రమే కాదు.. భక్తుల ఆరోగ్యం కోసం ఆయుద్వేద మందులు కూడా తయారు చేయగలం అంటోది తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ). కరోనా వైరస్‌ కట్టడి కోసం టీటీడీ ఆయుర్వేద మందుల తయారీ చేపట్టింది. ఎస్వీ ఆయుర్వేద కళాశాల, ఎస్వీ ఆయుర్వేద దవాఖాన, ఆయుర్వేద ఫార్మసీ సంయుక్తంగా ఐదు రకాల మందులను తయారు చేస్తున్నాయి. ఆ మందులను టీటీడీ జేఈవో బసంత్‌కుమార్‌ విడుదల చేశారు. ముందుగా ఈ ఆయుర్వేద మందులను టీటీడీ అన్న ప్రసాదం సిబ్బందికి అందజేశారు. కరోనా నివారణకు ఉపయోగపడే రక్షజ్ఞధూపం, పవిత్ర, గండూషము, నింబనస్యం, అమత మాత్రలను విడతల వారీగా పంపిణీ చేయనున్నట్ల టీటీడీ వెల్లడించింది.
Published by: Shravan Kumar Bommakanti
First published: April 9, 2020, 6:53 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading