హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

తిరుమల శ్రీవారి దర్శనం పై తుది నిర్ణయం.. మే 17 తరువాత

తిరుమల శ్రీవారి దర్శనం పై తుది నిర్ణయం.. మే 17 తరువాత

 కేంద్ర ప్రభుత్వ ఆదేశా అనుసారం మే 17 వరకు శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతించమని టీటీడి ఈవో అనిల్ కుమార్ సింఘూల్ తెలిపారు.

    కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా మే 17 వ తేదీ వరకు లాక్ డాన్ ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశా అనుసారం మే 17 వరకు శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతించమని టీటీడి ఈవో అనిల్ కుమార్ సింఘూల్ తెలిపారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల తదుపరి ఆదేశాలు అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించడం పై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. కేంద్రం లాక్ డౌన్ లో సడలింపులు ఇచ్చిన, శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు సామాజిక దూరం పాటిచాల్సి ఉంటుందని, కేంద్ర నిబంధనలు అనుసరిస్తూ.., భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించే విధి, విధానంపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, అదనపు ఈఓ ఏవి ధర్మారెడ్డితో కలసి ప్రణాళికలు సిద్ధం చేసుకొనున్నామన్నారు. అయితే ప్రస్తుతం శ్రీవారి నిర్వహించే నిత్య కైంకర్యాలు ఏకాంతంగా నిర్వహిస్తున్నామని అన్నారు. సోమవారం నుంచి బర్డ్స్ హాస్పిటల్ ఓపి సేవల ప్రారంభం పై తిరుపతి జేఈఓ.., బర్డ్స్ డైరెక్టర్ సమావేశం ఏర్పాటు చేసుకొని ఓ నిర్ణయం తీసుకున్నారని ఆ నిర్ణయంతోనే బర్డ్స్ ఓపిడి సేవలు ప్రారంభం అవుతాయన్నారు. హైకోర్ట్ ఆదేశాల మేరకు లాక్ డౌన్ లో నూతన టెండర్లు ఖరారు చేయకూడదనే నిబంధనల అనుసారం పద్మావతి హౌస్ కీపింగ్ వారికి నెల రోజుల పాటు టెండర్ పొడిగించమన్నారు. 1400 మంది కాంట్రాక్ట్ సిబ్బంది రేపటి నుంచి విధులకు హాజరవుతారని అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు.

    First published:

    Tags: Andhra Pradesh, Corona virus, Covid-19, Tirumal;a, Ttd

    ఉత్తమ కథలు