కరోనా వైరస్ ఎఫెక్ట్...టీటీడీ మరో కీలక నిర్ణయం

Coronavirus Alert | కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో భక్తులు తమ తిరుమల దర్శన టికెట్లు, ఆర్జిత సేవలు, గదుల బుకింగ్స్ తేదీలను మార్చుకునేందుకు లేదా రద్దు చేసుకునేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) వెసులుబాటు కల్పిస్తోంది.

news18-telugu
Updated: March 13, 2020, 11:20 AM IST
కరోనా వైరస్ ఎఫెక్ట్...టీటీడీ మరో కీలక నిర్ణయం
జూలై 28న మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ వ‌ర్ధంతి.
  • Share this:
కరోనా వైరస్ ప్రపంచ దేశాలను గజగజవణికిస్తోంది. కరోనా వైరస్ వ్యాపించకుండా దేశంలోనూ కేంద్ర ప్రభుత్వం, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పగడ్భందీ చర్యలు చేపట్టాయి. ఇటు నిత్యం వేలాది మంది భక్తులతో కిటకిటలాడే తిరుమలలోనూ కరోనా వైరస్ వ్యాపించకుండా టీటీడీ చర్యలు తీసుకుంటోంది. జలుబు, దగ్గు, జ్వరం తదితర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న భక్తులు స్వామివారి దర్శనం కోసం రావద్దని...కరోనా ప్రభావిత దేశాల్లోని భక్తులు తిరుమల దర్శనాన్ని వాయిదావేసుకోవాలని టీటీడీ ఇప్పటికే కోరింది. ఈ నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి దర్శనం కోసం మే నెల వరకు ముందస్తుగా బుక్‌ చేసుకున్న రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను రద్దు చేసుకునేందుకు, తేదీలు మార్పు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. అలాగే మే నెల వరకు చేసుకున్న ఇతర ఆర్జిత సేవలు, గదుల బుకింగ్‌లను కూడా రద్దు చేసుకునేందుకు కూడా వీలు కల్పించింది. దీన్ని రద్దు చేసుకుంటే సంబంధిత నగదు మొత్తాన్ని భక్తులకు తిరిగి చెల్లిస్తారు.

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్టు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాల కోసం ఈ-మెయిల్: dyeotemple@gmail.comకు సంప్రదించవచ్చు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా భక్తులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్న వారు దయచేసి అవి తగ్గిన తరువాతే తిరుమలకు రావాలని టీటీడీ మరోసారి విజ్ఞప్తిచేసింది.

ఇదిలా ఉండగా ఇక ఆలయంలో పనిచేసే ఉద్యోగులు కూడా మాస్క్‌లు ధరించేలా టీటీడీ అధికారులు సూచనలు చేశారు. ముఖ్యంగా భక్తుల రద్దీ ప్రాంతాల్లో సేవలంధించే ఉద్యోగులు మాస్క్‌లు ధరించేలా ఉద్యోగులకు వారి పై అధికారులు కౌన్సింగ్ ఇస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్‌లో కరోనా వైరస్ నివారణకు సంబంధించిన ప్రచార సందేశాలను ప్రసారం చేయనున్నారు.
First published: March 13, 2020, 11:20 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading