ఇప్పుడిప్పుడే కరోనా ప్రభావం నుంచి దేశం బయటపడుతోంది. ఈ సమయంలో కొత్తగా జికా వైరస్ (Zika Virus) వ్యాప్తి చెందుతుందా అనే ఆందోళన ప్రజల్లో కలుగుతోంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లోని కాన్పూర్‌లో మూడు జికా వైరస్ కేసులు నమోదు కావడంపై కలకలం రేగుతోంది. దీంతో వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు అధికారులు బాధితులకు సన్నిహితంగా ఉన్న వారిని గుర్తించి వారికి చికిత్స అందించే పనిలో పడ్డారు. ఉత్తర్ ప్రదేశ్‌లో కాన్పూర్ (Kanpur)లోనే ఇప్పటి వరకు నాలుగు కేసులు నమోదయ్యాయి. బాధితులకు జికా వైరస్ సోకినట్టు వైద్యాధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఈ బాధితులు ఆరోగ్యశాఖ అధికారుల పర్యవేక్షణలో ఉన్నాయి. యుద్ధ ప్రాతిపదికన బాధితులను కలిసిన వారిని గుర్తించేపనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
అక్టోబర్ 24న తొలి కేసు..
జికా వైరస్ కట్టడికి పూర్తిగా కృషి చేస్తున్నామని సీఎంఓ నేపాల్‌సింగ్ తెలిపారు. ప్రస్తుతం ఈ వైరస్ ఎక్కడి నుంచి వ్యాపిస్తోంది అనే అంశంపై ఆరా తీస్తున్నమన్నారు. వైద్య బృందాలు నిరంతరం ఈ పనిలో ఉన్నాయిన ఆయన అన్నారు.
NRI Murdered in US : ప్రాణాలు తీసిన ప్రైజ్ మనీ.. అమెరికాలో ఎన్ఆర్ఐ హత్య
ఎలా వెలుగులోకి..
కాన్పూర్‌లో అక్టోబర్ 24న తొలి జికా కేసు నమోదైం ది. వాయుసేనలో పనిచేసే ఓ
అధికారి కొన్ని రోజులుగా జ్వ రంతో బాధపడుతూ వాయుసేన ఆస్పత్రిలో చేరారు. ఆయన వద్ద నుంచి సేకరించిన నమూనాలను పుణెలోని ప్రయోగశాలకు పంపించారు. అనూహ్యంగా ఆయన రక్తనమూనాల్లో జికా వైరస్ బారినపడినట్లు తేలింది. దీంతో వెంటనే అప్రమత్తమైన వైద్యాధికారులు బాధితుడితో సన్నిహితంగా ఉన్న మరో 22 మందిని గుర్తించారు. వారికి మెరుగైన చికిత్స అందించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
పెరుగుతున్న కోవిడ్ కేసులు..
పశ్చిమ బెంగాల్ (Bengal), అస్సాం రాష్ట్రాల్లో కొవిడ్ కేసులు మళ్లీ పెరుగుతన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఈ రాష్ట్రాల్లో కోవిడ్ పాజిటివిటీ (Positivity Rate) రేటు క్రమంగా పెరుగుతోంది. బెంగాల్‌లో నెల రోజుల్లో పాజిటివిటీ రేటు1.93 నుంచి 2.39కు పెరిగింది. అస్సాలంలో నెలరోజుల్లో పాజిటివిటీ రేటు 1.89% నుం చి 2.22% పెరినట్టు సమాచారం. తక్షణమే ఆయా రాష్ట్రాలు కోవిడ్ పరీక్షలు, నియంత్రణ చర్యలు చేపట్టాలని లేఖ రాసింది.
దేశ వ్యాప్తంగా కోవిడ్ యాక్టీవ్ కేసులు కూడా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కోవిడ్ బారిన 14, 313మంది పడ్డట్టు సమాచారం. దేశంలో ఇప్పటి వరకు 3,42,60,470 కోవిడ్ కేసులునమోదు కాగా 3,36,41,175 మంది కోవిడ్ ను జయించారు. అయితే యాక్టీవ్ కేసుల సంఖ్య 1,61,555 పెరిగింది. రికవరీ రేటు పెరుగుతున్నా.. యాక్టీవ్ కేసులు పెరగడం ఆందోళన కలిగించే అంశంగా వైద్యశాఖ పేర్కొంది. కావున ఆయా రాష్ట్రాలు తగిన చర్యలు చేపట్టాలని కోరింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona, Covid 19 restrictions, Zika Virus