పాపం పసివాడు... తెలంగాణలో మూడేళ్ల బాలుడికి కరోనా

తెలంగాణలో ఈరోజు కొత్తగా ఇద్దరికి కరోనా పాజిటివ్ నిర్ధారించారు. వారిలో మూడేళ్ల బాలుడు కూడా ఉన్నాడు.

news18-telugu
Updated: March 25, 2020, 10:12 PM IST
పాపం పసివాడు... తెలంగాణలో మూడేళ్ల బాలుడికి కరోనా
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య మెల్లమెల్లగా పెరుగుతోంది. ఈ రోజు కొత్తగా మరో ఇద్దరికి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారించారు. తాజాగా నమోదైన రెండు కేసులతో తెలంగాణలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 41కు చేరింది. ఈ రోజు కొత్తగా నమోదైన కేసులలో ఓ మహిళతో పాటు మరో మూడు సంవత్సరాల బాలుడు ఉన్నాడు. గతంలో కరోనా వైరస్ సోకిన వ్యక్తిని కాంటాక్ట్ అయిన మహిళ (43)కు ఈ రోజు కరోనా నిర్ధరణ అయింది. ఆమె ఎలాంటి విదేశీయానం చేయలేదు. ప్రస్తుతం ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. ఆమె ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్టు వైద్యులు విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో తెలిపారు. ఇక 41వ కరోనా బాధితుడు ఓ మూడేళ్ల బాలుడు. గతంలో సౌదీ అరేబియా వెళ్లి వచ్చినట్టు ట్రావెల్ రికార్డు ఉంది. అయితే, కుటుంబం వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం బాలుడికి చికిత్స అందిస్తున్నారు.

తెలంగాణలో 41 కరోనా కేసుల నిర్ధారణ


ఇప్పటికే దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రజలు బయటకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక హైదరాబాద్‌లోని హాస్టర్లు, పేయింగ్ గెస్ట్ మేనేజ్‌మెంట్స్‌లో ఉండే వారు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వారిని బయటకు పంపడానికి వీల్లేదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. హాస్టళ్లకు కావాల్సిన నిత్యావసరాలు, ఇతర సరుకులు తెచ్చుకోవడానికి అనుమతి ఇస్తామని, ఎవ్వరినీ బయటకు పంపొద్దని స్పష్టం చేశారు. ఈ మేరకు హైదరాబాద్ పోలీసులు కూడా హాస్టల్ యజమానులకు ఆదేశాలు జారీ చేశారు.

First published: March 25, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు