ఏపీకి కొత్త టెన్షన్... శ్రీకాకుళం జిల్లాను తాకిన కరోనా

కరోనా సెగ శ్రీకాకుళం జిల్లాను సైతం తాకింది. నేడు అకస్మాత్తుగా మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో జిల్లా అధికారులు ఉలిక్కిపడ్డారు.

news18-telugu
Updated: April 25, 2020, 3:06 PM IST
ఏపీకి కొత్త టెన్షన్... శ్రీకాకుళం జిల్లాను తాకిన కరోనా
ఫ్రతీకాాత్మక చిత్రం
  • Share this:
ఏపీలో కరోనా కేసులు వెయ్యికి చేరువవుతున్నా... రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో మాత్రం కరోనా కేసులు నమోదు కాకపోవడం ప్రభుత్వానికి కొంతమేర ఊరట కలిగించింది. అయితే తాజాగా కరోనా సెగ శ్రీకాకుళం జిల్లాను సైతం తాకింది. నేడు అకస్మాత్తుగా మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో జిల్లా అధికారులు ఉలిక్కిపడ్డారు. పాతపట్నం ప్రాంతంలో పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో పాతపట్నంలో లాక్‌డౌన్‌ పకడ్బందీగా అమలు అవుతోంది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని శనివారం హుటాహుటీన శ్రీకాకుళం బయల్దేరారు.

కరోనా అనుమానిత లక్షణాలున్న పాతపట్నం యువకుడికి జరిపిన పరీక్షల్లో నెగటివ్‌ వచ్చినా, అతని కుటుంబ సభ్యులు ముగ్గురికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో కరోనా వచ్చిన వ్యక్తల కాంటాక్ట్‌లను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అనుమానితులుగా ఉన్న వారిలో తొలి వ్యక్తి ఢిల్లీ రైల్వేలో పనిచేస్తున్నారు. మార్చి 19న స్వస్థలానికి వచ్చారు. ఆయన ప్రయాణించిన రైళ్లలో మర్కజ్‌ మత ప్రార్థనలకు వెళ్లిన వారు ఉన్నట్టు అనుమానం. అందుకనే అధికారులు అప్రమత్తమై హోం క్వారంటైన్‌లో పెట్టారు. 28 రోజులు దాటాక ఆ వ్యక్తి బయటికి రావడం మొదలు పెట్టారు. దీన్ని గమనించిన అధికార యంత్రాంగం ముందు జాగ్రత్తగా పాతపట్నం సీహెచ్‌సీలో శాంపిల్స్‌ తీశారు. శనివారం ఉదయానికి ముగ్గురికి కరోనా పాజిటివ్‌ రావడంతో అధికారులు అప్రమత్తమై చర్యలు చేపట్టారు.

అనుమానిత వ్యక్తులు సంచరించిన సీది, కాగువాడ గ్రామాలకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న 27 గ్రామాలను అధికారులు దిగ్బంధం చేశారు. పాతపట్నం మండలంలోని సీది, తామర, తీమర, పాచిగంగుపేట, శోభ, రొంపివలస, రొంపివలస ఎస్సీ కాలనీ, పెద్ద సున్నాపురం, రొమదల, మాకివలస, కొరసవాడ, కాగువాడ, బూరగాం, పాతపట్నం, ప్రహరాజపాలెం, సీతారాంపల్లి, కోదూరు, బోరుభద్ర, శివరాంపురం, ఆర్‌ఎల్‌పురం, హిరమండలంలోని కల్లాట, కల్లాట కాలనీ, జిల్లేడుపేట, తంప, దనుపురం, సారవకోట మండలం నౌతల, కొత్తూరు మండలం జగన్నాథపురం గ్రామాలను దిగ్బంధం చేశారు. 26 మందిని క్వారంటైన్‌కు తరలించారు.
First published: April 25, 2020, 3:06 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading