విశాఖలో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. నగరంలోని సీతమ్మధార, గాజువాక, అనకాపల్లి ప్రాంతాలను హైరిస్క్ జోన్లుగా గుర్తించినట్టు మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఆ ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని వివరించారు. జిల్లా వ్యాప్తంగా 1470 మంది హోం క్వారంటైన్లో ఉన్నారని తెలిపారు. కరోనా నియంత్రణలో ప్రజలు భాగస్వామ్యం కావాలన్నారు. అందరూ ఇంటికే పరిమితమైతే కరోనాను తరిమికొట్టవచ్చని ఆళ్ల నాని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల్లో ప్రతిపక్షాలు భాగస్వామ్యం కావాలన్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.
మూడో దశకు రాకముందే మనమంతా జాగ్రత్త పడాలన్నారు. కరోనా వ్యాప్తిని నిరోధించడంలో భాగంగా విశాఖలో 20 కమిటీలను ఏర్పాటు చేశామని ఆళ్ల నాని వెల్లడించారు. విశాఖ జిల్లాలో 1470 మంది హోం క్వారంటైన్లో ఉన్నారని తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన వారు అధికారులకు సహకరించాలని... లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుని క్వారంటైన్‌కు తరలిస్తామని నాని స్పష్టం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Alla Nani, Andhra Pradesh, Coronavirus, Covid-19, Visakhapatnam