హైదరాబాద్‌లో రోడ్డుపై వేలాది మంది వలస కూలీల ఆందోళన..

ప్రతీకాత్మక చిత్రం

హైదరాబాద్ టోలిచౌకిలో వేలాది మంది కూలీలు పెద్ద ఎత్తున రోడ్డు మీదకు వచ్చి ఆందోళనకు దిగారు.

  • Share this:
    హైదరాబాద్ టోలిచౌకిలో వేలాది మంది కూలీలు పెద్ద ఎత్తున రోడ్డు మీదకు వచ్చి ఆందోళనకు దిగారు. తమను సొంత రాష్ట్రాలకు పంపాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. ఉత్తర్ ప్రదేశ్, బీహార్‌కు చెందిన వేలాది మంది కూలీలు హైదరాబాద్ టోలిచౌకి, చుట్టుపక్కల ప్రాంతాల్లో నిర్మాణ రంగం, ఇతరత్రా పనులు చేస్తున్నారు. వారంతా ఒకేసారి రోడ్డుమీదకు వచ్చారు. టోలిచౌకి వాస్తవానికి పరిశీలిస్తే రెడ్ జోన్ ఏరియా.కానీ, అంతమంది ఒకేసారి రోడ్డు మీదకు ఎలా వచ్చారనేది ఆందోళనకరంగా మారింది. అంతమంది ఒకేసారి రోడ్డుమీదకు రావడంతో పోలీసులు షాక్‌కి గురయ్యారు. వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. ఉన్నతాధికారులతో మాట్లాడి తాము సొంత రాష్ట్రాలకు పంపేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: