THOSE WHO VIOLATE THE LOCKDOWN RULES COULD FACE UP TO TWO YEARS IN PRISON BN
కరోనా ఎఫెక్ట్.. ఆ నిబంధన ఉల్లంఘించారో రెండేళ్ల జైలు శిక్ష
ప్రతీకాత్మక చిత్రం
కరోనా వైరస్ నేపథ్యంలో కేంద్ర విధించిన లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారికి రెండేళ్ల జైలుశిక్ష విధించే అవకాశాన్ని కేంద్రం పరిశీలిస్తోంది. ఆ మేరకు ఆయా రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి లేఖ రాశారు.
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా కేంద్రం దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించింది. అత్యవసరమైతే తప్ప ఇళ్లలో నుంచి ఎవరూ బయటకు రావొద్దని ఎంత చెబుతున్నా.. కొందరు వినడం లేదు. రోడ్ల మీదకొచ్చి విచ్చలవిడిగా తిరిగేస్తున్నారు. అయితే లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలను తీసుకునేందుకు కేంద్రం నిర్ణయించింది. అందులో భాగంగానే కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. ఏ నిబంధన ఉల్లంఘించిన వారిపై ఏ చర్య తీసుకోవాలనే విషయాన్ని చెబుతూ పూర్తి జాబితాను రాష్ట్రాలకు పంపించారు. లాక్డౌన్ అమలును ఉల్లంఘించే వారిపట్ల జాతీయ విపత్తు నిర్వహణ చట్టం-2005 కింద రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించవచ్చంటూ స్పష్టంటూ పేర్కొంటూ నిబంధనల జాబితాను కేంద్రం రాష్ట్రాలకు పంపించింది. ఈ జాబితా అనుగుణంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను ఆదేశించింది.
Published by:Narsimha Badhini
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.