అక్కడ ఉద్యోగం పోతే నెలకు రెండు వేల డాలర్లు.. కెనడా నుంచి న్యూస్18 స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్

కెనడాలోని లండన్ సిటీ ఒంటరియో ప్రావిన్స్ నుంచి మారుపాక శివ

కరోనా వల్ల ఎవరైనా ఉద్యోగం కోల్పోయిన గతంలో కంటే తక్కువ గంటలు పని మాత్రమే దొరుకుతున్న ప్రజలను ఆదుకోవడానికి కెనడా ప్రభుత్వం కెనడా ఎమర్జెన్సీ రెస్పాన్స్ బెనిఫిట్ స్కీమ్ ధ్వారా ఈ దేశ పౌర సత్వంతో సంబంధం లేకుండా ఆదుకొంటోంది.

 • Share this:
  కెనడాలోని లండన్ సిటీ ఒంటరియో ప్రావిన్స్ నుంచి మారుపాక శివ

  ప్రపంచ దేశాలను కరోనా వైరస్ గడగడలాడిస్తోంది. వైరస్ వ్యాప్తి నియంత్రణ నేపథ్యంలో ప్రపంచ దేశాలు లాక్‌డౌన్‌ను పాటిస్తున్నాయి. అందులో భాగంగా కెనడాలోనూ పకడ్బంధీగా అమలవుతోంది.  కెనడాలో ఇప్పటివరకు 4,54,983 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా, ఇందులో 4,27,017 మందికి వ్యాధి సోకలేదని తేలింది. 27,046 మందికి పాజిటివ్‌గా తేలింది. కాగా ఇప్పటికే 903 మంది కరోనా వైరస్‌కు బలయ్యారు. దీంతో కెనడాలో లాక్‌డౌన్‌ నిబంధనలను ప్రభుత్వం పక్కాగా అమలయ్యేలా చూస్తోంది. ఇప్పటికే స్కూల్స్, కాలేజీలు, యూనివర్సిటీలన్నింటిని ప్రభుత్వం మూసేసింది. ప్రజల రద్దీ ఎక్కువగా ఉండే షాపింగ్ మాల్స్, ఆడిటోరియాలు, ఇండోర్ స్టేడియాలు, జిమ్స్, ప్రార్థన స్థలాలు సామాజిక దూరాన్ని పాటించేలా నిబంధనలు రూపొందించారు. సోషల్ డిస్టెన్స్ పాటించకుండా నేరుగా రూ.వెయ్యి కెనెడియన్ డాలర్ల జరిమానా విధిస్తోంది.

  canada, dollors, lockdown, covid-19, corona, corona virus, telugu students, కెనడా, కెనెడియన్ డాలర్లు, లాక్‌డౌన్, కోవిడ్-19, కరోనా, కరోనా వైరస్, కోవిడ్-19, తెలుగు విద్యార్థులు

  నిబంధనలు పాటించని స్టోర్స్‌కు లక్ష డాలర్లు..
  ఇక నిత్యావసర వస్తువులు విక్రయశాలలు వాల్మార్ట్, డాలర్ స్టోర్ లాంటి సంస్థలను ప్రజలకు అందుబాటులో ఉంచారు. ఇక కొన్ని సంస్థలు సీనియర్ సిటిజన్స్ ఫిజికల్ ఛాలెంజెడ్ పర్సన్స్ కు మాత్రమే సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 7 నుంచి 8 గంటల మధ్యలో ప్రత్యేకంగా షాపింగ్ చేసుకొనే వెసులుబాటు కల్పించింది. ఇక ఈ స్టోర్స్ లో కూడా పరిమిత సంఖ్యలోనే ప్రజలను లోనికి అనుమతిస్తున్నారు. సోషల్ డిస్టెన్స్ (వ్యక్తికి వ్యక్తికి మధ్య 2 అర్మ్స్ డిస్టెన్స్ ) పాటించేలా చర్యలు తీసుకోవాలని, స్టోర్ లోపల బయట ప్రజలకు శానిటైజర్లను అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఈ నిబంధనలు పాటించని స్టోర్స్ కు లక్ష కెనెడియన్ డాలర్ల భారీ జరిమానా ప్రభుత్వం విధిస్తోంది.

  canada, dollors, lockdown, covid-19, corona, corona virus, telugu students, కెనడా, కెనెడియన్ డాలర్లు, లాక్‌డౌన్, కోవిడ్-19, కరోనా, కరోనా వైరస్, కోవిడ్-19, తెలుగు విద్యార్థులు

  కెనడా ఎమర్జెన్సీ రెస్పాన్స్ బెనిఫిట్ స్కీమ్..
  ఇక కరోనా వల్ల ఎవరైనా ఉద్యోగం కోల్పోయిన గతంలో కంటే తక్కువ గంటలు పని మాత్రమే దొరుకుతున్న ప్రజలను ఆదుకోవడానికి కెనడా ప్రభుత్వం కెనడా ఎమర్జెన్సీ రెస్పాన్స్ బెనిఫిట్ స్కీమ్ ధ్వారా ఈ దేశ పౌర సత్వంతో సంబంధం లేకుండా ఆదుకొంటోంది. సాధారణంగా ప్రకృతి విపత్తులు పెద్దఎత్తున సంభవించినపుడు మాత్రమే కెనడా ఎమర్జెన్సీ రెస్పాన్స్ బెనిఫిట్ స్కీమ్ అందుబాటులోకి వస్తుంది. కోవిడ్-19 వల్ల ఏర్పడ్డ ప్రస్తుత పరిస్థితులను కూడా ప్రకృతి విపత్తు కింద పరిగణించి ఈ స్కీమ్ ను ఇక్కడి ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఈ స్కీమ్ ఇక్కడ విద్యనభ్యసిస్తున్న మన భారతీయ విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమనే చెప్పొచ్చు. సాధారణంగా అత్యధిక విద్యార్థులు పార్ట్ టైం జాబ్ చేస్తూ నెలకు వెయ్యి కెనెడియన్ డాలర్ల లోపల వేతనాన్ని పొందుతారు. ప్రస్తుత పరిస్థితుల్లో రెస్టారెంట్లు మొదలు అనేక స్టోర్స్ పూర్తిగా షాట్ డౌన్ అయ్యాయి. దీంతో మన దేశ విద్యార్థులు తమ తమ ఉద్యోగాలను కోల్పోయారు. కానీ వీరికి ఈ స్కీమ్ వరంగా మారింది.

  canada, dollors, lockdown, covid-19, corona, corona virus, telugu students, కెనడా, కెనెడియన్ డాలర్లు, లాక్‌డౌన్, కోవిడ్-19, కరోనా, కరోనా వైరస్, కోవిడ్-19, తెలుగు విద్యార్థులు

  16 వారాల పాటు 2వేల కెనెడియన్ డాలర్స్..
  గత ఆర్ధిక సంవత్సరంలో (జనవరి 2019- డిసెంబర్ 2019) 5000 కెనెడియన్ డాలర్స్ ఆదాయాన్ని ఆర్జించిన వ్యక్తి ప్రస్తుత పరిస్థితుల్లో కొలువును కోల్పోవడం లేదా గతంలో కంటే తక్కువ పని గంటలు లభిస్తున్నట్లైతే ఆ వ్యక్తికి నెలకు రెండు వేల కెనడియన్ డాలర్ల చొప్పున 16 వారాల పాటు ఈ స్కీమ్ కింద ఆర్థిక సహాయం అందిస్తోంది. ఇక పరిస్థితి ఇదే విధంగా ఉంటె ఈ స్కీమ్ పొడిగించే అవకాశాలు ఉన్నాయి... విద్యార్థుల తల్లితండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇక 5000 కెనెడియన్ డాలర్ల కంటే తక్కువ ఆదాయాన్ని ఆర్జించిన వ్యక్తులు ఈఐ (ఎంప్లాయ్ ఇన్సూరెన్స్) దరఖాస్తు చేసుకుంటే.. వారానికి వారి గత సంపాదనను బట్టి కొంత మొత్తాన్ని ప్రభుత్వం అందిస్తోంది. ఇది కూడా సగటున వారానికి 200 కెనెడియన్ డాలర్లు అంటే నెలకు 800 కెనెడియన్ డాలర్ల మొత్తని పొందవచ్చు. ఒకవేళ కొలువు లేనట్లైతే ఇక ఇంటి అద్దె కూడా చెల్లించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తెలిపింది. దేశంలోని ఆయా ప్రావిన్సుల్లోని కొన్ని ప్రాంతాల్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది.
  Published by:Narsimha Badhini
  First published: