Vaccine For Children : దేశవ్యాప్తంగా 15 నుంచి 18 ఏళ్ల వారికి ఈ ఏడాది జనవరి 3 నుంచి కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే పిల్లల టీకా పంపిణీకి సంబంధించి తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2023, జనవరి 1 నాటికి
Covid Vaccination For Children : దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగుతోంది. ప్రపంచంలోని మిగతా అన్ని దేశాల కన్నా రికార్డుస్థాయిలో వ్యాక్సిన్ లను ప్రజలకు అందిస్తూ వ్యాక్సినేషన్ లో సరికొత్త మైలురాయిని భారత్ చేరుకుంటోంది. ఇక,ఒమిక్రాన్ విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ ను మరింత స్పీడప్ చేసింది కేంద్రప్రభుత్వం. ఈ నేపథ్యంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. దేశవ్యాప్తంగా 15 నుంచి 18 ఏళ్ల వారికి ఈ ఏడాది జనవరి 3 నుంచి కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే పిల్లల టీకా పంపిణీకి సంబంధించి తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2023, జనవరి 1 నాటికి 15 ఏళ్లు నిండబోయే పిల్లలు కూడా 15-18 ఏళ్ల కేటగిరి కింద కోవిడ్ వ్యాక్సిన్ పొందేందుకు అర్హులు అని తాజాగా కేంద్రప్రభుత్వం ప్రకటించింది.
ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ అన్ని కేంద్రపాలిత, రాష్ట్ర ప్రభుత్వాలకు ఓ లేఖ రాసింది. 2007 లేదా అంతకుముందు పుట్టిన పిల్లలందరూ కూడా వ్యాక్సిన్ తీసుకునేందుకు అర్హులు అని రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలకు రాసిన లేఖలో పేర్కొంది. తాజా మార్గదర్శకాల ప్రకారం 2005, 2006, 2007 సంవత్సరాల్లో పుట్టిన పిల్లలందరూ వ్యాక్సిన్ తీసుకోవడానికి అర్హులే.
ALSO READ Omicron: ఒమిక్రాన్ తరువాత పుట్టుకొచ్చే వేరియంట్ అలా ఉంటుందా ?..WHO శాస్త్రవేత్త కీలక వ్యాఖ్యలు
మరోవైపు, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ ఇవాళ దక్షిణాది రాష్ట్రాలతో వ్యాక్సినేషన్, కరోనా తాజా పరిస్థితులపై సమీక్ష నిర్వహించనున్నారు. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, లక్షద్వీప్, తెలంగాణ, అండమాన్ అండ్ నికోబార్ దీవుల ఆరోగ్యశాఖ మంత్రులు ఈ సమావేశానికి హాజరు కానున్నట్లు సమాచారం.
ఇక, దేశంలో కోవిడ్ విజృంభణ కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా రోజువారీ పాజిటివ్ కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. ప్రస్తుతం రోజువారీ పాజిటివిటీ రేటు 15.88 శాతానికి పెరిగింది. అంటే ప్రతి 100 మందిలో 15 మంది కోవిడ్ బారిన పడుతున్నారు. ఇక గడిచిన 24 గంటల్లో 2,51,209 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న కరోనాతో 627 మంది చనిపోయారు. ఒకే రోజు 3,47,443 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4 కోట్ల ఆరు లక్షలకు చేరింది. మరణాల సంఖ్య 4,92,327కు చేరింది. దేశంలో ప్రస్తుతం 21 లక్షల 5వేల 611 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు దేశంలో 164.44 కోట్ల వ్యాక్సినేషన్ పంపిణీ చేశారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ కోవిడ్ పై శుక్రవారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.