హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

ఖైరతాబాద్ గణేశ్‌పై కరోనా ప్రభావం.. ఒకే ఒక్క అడుగు.. చరిత్రలో తొలిసారి..

ఖైరతాబాద్ గణేశ్‌పై కరోనా ప్రభావం.. ఒకే ఒక్క అడుగు.. చరిత్రలో తొలిసారి..

ఖైరతాబాద్ వినాయకుడు

ఖైరతాబాద్ వినాయకుడు

కరోనా ప్రభావంతో చరిత్రలో తొలిసారిగా ఖైరతాబాద్ గణనాథుడి విగ్రహ ఎత్తును భారీ ఎత్తున తగ్గించనున్నారు.

కరోనా వైరస్ వల్ల అన్ని రంగాలూ స్తంభించిపోయాయి. కోవిడ్ మహమ్మారి భయానికి పండగలు జరుపుకోలేని పరిస్థితి నెలంకొది. ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండాల్సి వస్తోంది. ఉగాది, రంజాన్, ఈస్టర్ పండగలు కూడ అలాగే గడచిపోయాయి. ఈ క్రమంలో కరోనా వైరస్ ప్రభావం గణేస్ చతుర్థి వేడకలపైనా పడబోతోంది. వినాయక ఉత్సవాలకు సంబధించి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది కేవలం అడుగు ఎత్తులోనే గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్టించాలని నిర్ణయించింది. వాస్తవానికి వినాయక చవితికి మూడు నెలల ముందు నుంచే ఖైరతాబాద్ విగ్రహ నిర్మాణ పనులు ప్రారంభమవుతుంటాయి. దీనికి సంబంధించి మే 18న కర్రపూజ జరగనున్న నేపథ్యంలో ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ ఏడాది ఆగస్టు 22న వినాయక చవితి పండగ ఉంది. ఖైరతాబాద్ భారీ వినాయకుడికి.. కేవలం జంట నగరాల్లోనే కాదు. దేశవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రతి ఏటా భారీ ఎత్తున గణేష్ విగ్రహాన్ని ప్రతిష్టిస్తారు. ఇక్కడే గవర్నర్ తొలి పూజ చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ మహా గణపతిని సందర్శించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. భారీగా క్యూలైన్లు కనిపిస్తుంటాయి. ఐతే మన దేశంలో కరోనా ప్రభావం ఇప్పట్లో తగ్గేలా లేదని నిపుణులు చెబుతున్నారు. ఆగష్టు, సెప్టెంబరు వరకు భౌతిక దూరం, మాస్కులు, శానిటైజర్లు వాడడం తప్పనిసరని అంటున్నారు. కానీ ఖైరతాబాద్ గణేశుడి భారీ ఎత్తున ప్రతిష్టిస్తే పెద్ద మొత్తంలో భక్తులు తరలి వస్తుంటారు. అప్పుడు భక్తులను భౌతిక దూరం పాటించేలా నియంత్రించడం సాధ్యపడదు. అందుకే వేడుకలను వైభవంగా నిర్వహించకుండా.. సాదాసీదాగా నిర్వహించాలని ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ నిర్ణయించింది.

1954లో తొలిసారిగా ఖైరతాబాద్‌ గణేష్ కొలువుదీరాడు. తొలిసారి కావడంతో అప్పుడు ఒకే ఒక్క అడుగు ఎత్తుతో వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఆ తర్వాత ఏడాదికి ఒక అడుగు చొప్పున వినాయకుడి ఎత్తును పెంచుతూ వచ్చారు. అలా 60 ఏళ్లు వచ్చేసారికి ఖైరతాబాద్ గణనాథుడి ఎత్తు 60 అడుగులకు చేరింది. ఐతే ఎత్తు మరీ ఎక్కువ కావడంతో.. ఎన్నో సమస్యలు వచ్చేవి. ఈ క్రమంలోనే 2014 నుంచి ఏడాదికి ఒక అడుగు చొప్పున ఎత్తు తగ్గించాలని గణేష్ ఉత్సవ కమిటీ నిర్ణయించింది. ఐనప్పటికీ తలపైన చేసే అలంకరణతో ఎత్తు మాత్రం 60 అడుగలకు పైనే ఉండేది. గత ఏడాది 61 అడుగుల ఎత్తులో ఖైరతాబాద్ వినాయకుడి దర్శనమిచ్చాడు. ఐతే కరోనా ప్రభావంతో చరిత్రలో తొలిసారిగా ఖైరతాబాద్ గణనాథుడి విగ్రహ ఎత్తును భారీ ఎత్తున తగ్గించనున్నారు.

First published:

Tags: Coronavirus, Covid-19, Khairatabad ganesh

ఉత్తమ కథలు