ఈ ఇంటి ఓనర్ దేవుడు... కరోనా ఉన్నన్నాళ్లూ అద్దె మాఫీ...

రెండు అంతస్తుల ఆ భవనంలో నాలుగు కుటుంబాలు అద్దెకు ఉంటున్నాయి. కరోనా వైరస్ ఉన్నన్ని రోజులు వారికి అద్దె మాఫీ చేస్తున్నట్టు ఇంటి యజమాని ప్రకటించాడు.

news18-telugu
Updated: March 26, 2020, 7:20 PM IST
ఈ ఇంటి ఓనర్ దేవుడు... కరోనా ఉన్నన్నాళ్లూ అద్దె మాఫీ...
(ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
కరోనా వైరస్ ప్రభావంతో ప్రజలు అందరూ భయభ్రాంతులకు గురవుతున్నారు. కరోనా వైరస్ వల్ల దేశవ్యాప్తంగా కంపెనీలు అన్నీ మూతపడ్డాయి. ఉద్యోగులు, కూలిపని చేసుకునే వారు, విద్యార్థులు.. ఒకటేమిటి అన్ని రంగాల వారూ ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు పడే కష్టాలు ఒక ఎత్తయితే, రాబోయే రోజుల్లో ఎదురయ్యే కష్టాలు వారిని మరింత కలవరపాటుకు గురిచేస్తున్నాయి. వచ్చే నెలలో ఇంటి అద్దె కట్టడం ఎలా? హాస్టల్ ఫీజు కట్టడం ఎలా? కూరగాయల పరిస్థితి ఏంటి, స్కూళ్ల ఫీజులు కట్టడం ఎలా అనే భయాలు అందరిలోనూ నెలకొన్నాయి. అయితే, అన్నీ తీర్చలేకపోయినా, తన వంతుగా తన పరిధిలో ఉన్న మేరకు పెద్దమనసు చాటుకున్నాడు ఓ ఇంటి యజమాని. హైదరాబాద్ జీడిమెట్లలోని సుభాష్ నగర్‌లో ఉండే ఓ ఇంటి యజమాని, తన ఇంట్లో అద్దెకు ఉంటున్న నాలుగు కుటుంబాలకు అద్దె మాఫీ చేసేశాడు. రెండు అంతస్తుల భవనంలో ఇంటి ఓనవర్‌తో నాలుగు కుటుంబాలు అద్దెకు ఉంటున్నాయి. కరోనా వైరస్ వల్ల ఆ ఇళ్లలో ఉండే వారు, గడప దాటలేని పరిస్థితి నెలకొంది. దీంతో కరోనా వైరస్ తగ్గే వరకు తనకు ఇంటి అద్దె కట్టాల్సిన అవసరం లేదని ఆ ఇంటి యజమాని హామీ ఇచ్చాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

First published: March 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు