ఈ 105 ఏళ్ల గాగుల్స్ బామ్మను చూశారా?.. ఆమె విజయగాధ చదవండి..

ఈ 105 ఏళ్ల గాగుల్స్ బామ్మను చూశారా?.. ఆమె విజయగాధ చదవండి..

105 ఏళ్ల బామ్మ (Image: @nytimes/Twitter)

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ఎంతో మందిని ప్రభావితం చేసింది. ముఖ్యంగా వృద్ధుల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉండి వారికి ప్రమాదకారిగా మార్చింది. మరణించే శాతం కూడా వీరిలోనే ఎక్కువగా ఉందనే విషయం తెలిసిందే.

  • Share this:
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ఎంతో మందిని ప్రభావితం చేసింది. ముఖ్యంగా వృద్ధుల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉండి వారికి ప్రమాదకారిగా మార్చింది. మరణించే శాతం కూడా వీరిలోనే ఎక్కువగా ఉందనే విషయం తెలిసిందే. అయితే రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉన్న వృద్ధులు కూడా ఎంతో మంది మహమ్మారి నుంచి కోలుకొని మరణాన్ని జయించారు. తాజాగా 105 ఏళ్ల లూసియా డిక్లేర్క్ కరోనా నుంచి బయటపడింది. గతంలో స్పానిష్ ఫ్లూ ని కూడా ఎదుర్కొన్న ఆమె ఇప్పుడు కరోనాను కూడా జయించడం విశేషం. ఆమె రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉండడమే దీనికి కారణం. ఆమె ఇంత ఆరోగ్యంగా ఉండేందుకు కారణం ఆమె జంక్ ఫుడ్ అస్సలు తీసుకోదట. అంతేకాకుండా కరోనా నుంచి బయటపడేందుకు మరోక ముఖ్యమైన వస్తువుతో కూడా సంబంధం ఉందని తెలిపింది. ప్రతి రోజు ఉదయాన్ని నానబెట్టిన 9 ఎండు ద్రాక్షలను ఆహారంగా తీసుకోవడం వల్లే తను ఆరోగ్యంగా ఉన్నానని ఈ బామ్మ స్పష్టం చేసింది.

కరోనా బారినప్పుడు 9 రోజుల పాటు రోజు మార్చి రోజు వీటిని తీసుకున్నట్లు ఈ బామ్మ తెలిపింది. తన ఆరోగ్య చిట్కాలను పిల్లలు, మనవలు, మనవరాళ్లు కూడా ఫాలో అవుతున్నారని చెబుతోంది. అంతేకాకుండా కలబందరసాన్ని నేరుగా తాగడం, బేకింగ్ సోడాతో పళ్లు తోముకోవడం లాంటి ఈమె దైనందిన అలవాట్లు. 99 ఏళ్ల వరకు కూడా దంతాల్లో క్యావిటీ సమస్య లేదని, అప్పటివరకు ఆమె పనిచేసిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

లూసియా గ్వాటెమాల, స్పెయిన్ నుంచి వచ్చిన తన తల్లిదండ్రులకు 1916లో హవాయిలో జన్మించింది. రెండు ప్రపంచ యుద్ధాలతో పాటు స్పానిష్ ఫ్లూను కూడా చూసింది. జీవిత కాలంలో ముగ్గురు భర్తలు, ఓ కుమారుడి మరణాలను చవిచూసింది. న్యూజెర్సీకి రాకముంది కాలిఫోర్నియాలోని వ్యోమింగ్ లో నివసించి తిరిగి హవాయికి వెళ్లింది. అక్కడ ఆమె తన పెద్ద కుమారుడితో కలిసి జీవించింది. 90 ఏళ్ల నిండిన తర్వాత న్యూజెర్సీ తీరం వెంబడి మనహవ్కిన్, ఎన్జేలోని ఓ ఓల్డేజ్ హోమ్ కి వెళ్లింది. అక్కడ నాలుగు ఏళ్ల క్రితం గాయపడే వరకు చురుకుగా జీవించగలిగింది. దక్షిణ న్యూజెర్సీలోని సౌత్ జెర్సీ నర్సింగ్ హోం పురాతన నివాసి అయిన డిక్లేర్క్ 105వ జన్మదినాన్ని జనవరిలో జరుపుకుంది. అయితే ఇదే నెల 25 కరోనా బారిన పడింది. ఫైజర్ వ్యాక్సీన్ రెండో డోసు తీసుకున్న మర్నాడే ఆమెకు ఈ వ్యాధి సోకడం గమనార్హం. వ్యాధి సోకినప్పుడు మొదటి ఆమె భయపడిందని, ఒంటరిగా ఉండటాన్ని ఇష్టపడలేదు. లిటిల్ ఎగ్ హార్బర్ లోని 120 పడకల సదుపాయమైన మిస్టిక్ మెడోస్ రిహాబిలిటేషన్ అండ్ నర్సింగ్ హోంకు తరలించారు.

ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్న లూసియా డిక్లేర్క్ కు ఇద్దరు కుమారులు, ఐదుగురు మనవళ్లు, 12 మంది మునిమనవళ్లతో సహా.. 11 మంది మునిముని మనవళ్లను కలిగి ఉంది. వారంత ఆమెను గ్రాండ్ మా లూసియా అని పిలుస్తారట. గతేడాది 104వ జన్మదినోత్సవాన్ని లూసియా జరపుకుందని, ఆ సమయంలోనే కరోనా కలకలం అందరిని ఆందోళన కలిగించిందని ఆమె కుమారుడు 78 ఏళ్ల ఫిలిప్ లాస్ తెలిపారు. అయితే కరోనా వచ్చినా కానీ దాన్నుంచి ఆమె కోలుకోవడం నమ్మలేకపోతున్నామని ఆయన అన్నారు.మిస్టిక్ మిడోస్ లో నివసిస్తున్న లూసియా డిక్లేర్క్ చుట్టుపక్కల వారిలో 62 మంది కరోనా కారణంగా మరణించారు. ముగ్గురు ఆసుపత్రిలో పర్యవేక్షణలో ఉన్నారు. లూసియా కరోనా టీకాలు కూడా తీసుకుంది. ఇవి తాను కోలుకోవడానికి చాలావరకు తోడ్పడ్డాయని ఆమె చెబుతున్నారు. ఇటీవల కాలంలో ప్రపంచంలోనే అత్యంత వయస్కురాలైన సిస్టర్ ఆండ్రే(116) కరోనా నుంచి కోలుకున్నారు. మహమ్మారి నుంచి బయటపడిన అత్యంత పెద్ద వయస్కురాలిగా ఆండ్రే రికార్డు సృష్టించింది.  ఈ నెల ప్రారంభంలో తన 117వ పుట్టినరోజు సందర్భంగా ఆగ్నేయ ఫ్రాన్స్ లోని టౌలాన్ నగరంలోని ఓ నర్సింగ్ హోంలో జన్మదిన వేడుకలు జరుపుకుంది.
Published by:Ashok Kumar Bonepalli
First published:

అగ్ర కథనాలు