Home /News /coronavirus-latest-news /

THIRD COVID 19 WAVE LIKELY TO HIT INDIA BY OCTOBER SAYS REUTERS POLL OF MEDICAL EXPERTS SU

Third Covid 19 Wave: ఆ నెలలో భారత్‌లో కరోనా థర్డ్ వేవ్‌ వ్యాప్తి.. చిన్నారులపై ప్రభావం.. నిపుణులు ఏం చెప్పారంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కరోనా థర్డ్ వేవ్‌కు సంబంధించి పలు రకాల వార్తలు వెలువడుతున్నాయి. వీటిలో కొన్ని జనాలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి.

    భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే కరోనా థర్డ్ వేవ్‌కు సంబంధించి పలు రకాల వార్తలు వెలువడుతున్నాయి. వీటిలో కొన్ని జనాలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. తాజాగా భారత్‌లో అక్టోబర్ నెలలో కరోనా థర్డ్ వేవ్ వ్యాపించే అవకాశం ఉందని రాయిటర్స్ వార్తా సంస్థ నిర్వహించిన సర్వేలో మెజారిటీ వైద్య నిపుణులు అభిప్రాయపడ్డారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న ఆరోగ్య సంరక్షణ నిపుణులు, వైద్యులు, శాస్త్రవేత్తలు, వైరాలజిస్టులు, ఎపిడమాలజిస్టులతో కూడిన 40 మంది ప్రొఫెష‌న‌ల్స్ తో ఈ స‌ర్వేను నిర్వ‌హించారు. జూన్ 3 నుంచి 17వ తేదీ మధ్యలో ఈ సర్వేను జరిపినట్టుగా రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది.

    భారత్‌లో థర్డ్ వేవ్ ఎప్పుడు వస్తుందనే ప్రశ్నకు.. 24మంది నిపుణుల్లో 21మంది అక్టోబర్‌ నాటికి వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. వీరిలో ఓ ముగ్గురు ఆగస్టు తొలినాళ్లలోనే, 12 మంది సెప్టెంబర్‌లో భారత్‌లో కరోనా థ‌ర్డ్ వేవ్ తలెత్తుతుంద‌ని చెప్పారు. మరో ముగ్గురు మాత్రం నవంబర్‌ ఫిబ్రవరి మధ్య కాలంలో థర్డ్‌వేవ్‌ వచ్చే అవకాశముందని తెలిపారు.

    కరోనా సెకండ్ వేవ్‌తో పోల్చితే థర్డ్ వేవ్‌ను బాగా నియంత్రించవచ్చని సర్వేలో పాల్గొన్న 34 నిపుణుల్లో 24 మంది అభిప్రాయపడ్డారు. ఆక్సిజ‌న్, వ్యాక్సిన్లు, వైద్య ప‌రిక‌రాలు అందుబాటులో ఉండ‌టం ఇందుకు ఉపయోగపడుతుందని చెప్పారు. ఇప్పటికే దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నందున్న.. కేసుల సంఖ్య తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్ట‌ర్ ర‌ణ‌దీప్ గులేరియా ఆశాభావం వ్య‌క్తం చేశారు

    పిల్లలపై థర్డ్ వేవ్ ప్రభావం..
    కరోనా థర్డ్ వేవ్ పిల్లలపైనే ఎక్కువ ప్రభావం చూపుతుందని సర్వేలో పాల్గొన్న 40 మంది నిపుణుల్లో 26 మంది అభిప్రాయపడ్డారు. మరో 14 మంది మాత్రం పిల్లలకు ఏమి ప్రమాదం లేదని చెప్పారు. 18ఏళ్ల లోపు పిల్లలకు వ్యాక్సిన్‌ ఇప్పటివరకు అందుబాటులో లేకపోవడమే ముప్పుకు కారణమని National Institute of Mental Health and Neurosciencesకు చెందిన ఎపిడమాలజి హెడ్ డాక్టర్‌ ప్రదీప్‌ బనాందూర్‌ అభిప్రాయపడ్డారు

    పిల్లలు ఎక్కువ సంఖ్యలో కరోనా వైరస్ బారిన పడితే.. అందుకు మనం సన్నద్ధంగా లేకపోతే.. చివరి నిమిషాల్లో చేసేదేమీ ఉండదని కొవిడ్‌పై కర్ణాటక ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ దేవీ శెట్టి అన్నారు. దేశంలో చిన్నారులకు సంబంధించి ఐసీయూ పడకలు తక్కువగా ఉన్నాయని.. ఈ పరిస్థితుల్లో ముప్పు ఎక్కువగా ఉండే ప్రమాదం ఉందని అన్నారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Corona third wave, Covid-19

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు