సారీ.. ఇది వ్యాక్సిన్ అని తెలీదు.. ఎత్తుకెళ్లిన టీకాలను పోలీస్ స్టేషన్ ముందు వదిలివెళ్లిన దొంగలు

దొంగలు వదిలివెళ్లిన నోటు

బుధవారం రాత్రి ఆ ఆస్పత్రిలోని లాకర్లను ఓపెన్ చేసిన ఇద్దరు దొంగలు.. అందులో నిల్వ ఉన్న వ్యాక్సిన్లను ఎత్తుకెళ్లారు.

 • Share this:
  దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తున్న ప్రస్తుత తరుణంలో వ్యాక్సిన్‌కు ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. ప్రతి రోజూ దేశవ్యాప్తంగా కొన్ని లక్షల మందికి వ్యాక్సిన్ వేస్తున్నారు ప్రభుత్వం, ప్రైవేటు వైద్య సిబ్బంది. ఇందుకోసం లక్షల సంఖ్యలో వ్యాక్సిన్ డోసులను నిల్వ ఉంచుతున్నారు. అయితే ఇటీవల హర్యానాలోని జింద్ ఆస్పత్రి నుంచి వ్యాక్సిన్‌లను దొంగలించడం సంచలనం సృష్టించింది. బుధవారం రాత్రి ఆ ఆస్పత్రిలోని లాకర్లను ఓపెన్ చేసిన ఇద్దరు దొంగలు.. అందులో నిల్వ ఉన్న వ్యాక్సిన్లను ఎత్తుకెళ్లారు. మొత్తం 700 డోసుల కోవాగ్జిన్ డోసులను తమతో పాటు తీసుకెళ్లారు.

  ఉదయం డ్యూటీకి వచ్చిన స్వీపర్.. లాకర్లు తెరిచి ఉండటం చూసి అవాక్కయ్యింది. వెంటనే డాక్టర్లకు సమాచారం అందించింది. వెంటనే అక్కడికి చేరుకున్న వైద్య సిబ్బంది.. వ్యాక్సిన్ డోసులు దొంగతనం జరగడాన్ని గమనించారు. పోలీసులకు సమాచారం అందించారు. ఈ కేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులు.. కేసును సాధ్యమైనంత తొందరగా చేధించి దొంగలను పట్టుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు.

  అయితే పోలీసులు తమపై ఎక్కువగా దృష్టి పెట్టారని అనుకున్నారో లేక ఏదో అనుకుని తమకు అవసరం లేని వ్యాక్సిన్ దొంగలించామని అనుకున్నారో తెలియదు కానీ.. తాము దొంగతనం చేసిన వ్యాక్సిన్ డోసులను జింద్ సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న టీ స్టాల్ దగ్గర వదిలి వెళ్లారు. అంతేకాదు తాము చేసిన తప్పుకు క్షమాపణలు చెప్పారు దొంగలు. సారీ.. నేను దొంగలించింది కరోనా వ్యాక్సిన్ అని తెలియదు అంటూ ఓ నోటును రాసి పెట్టి అక్కడ వదిలివెళ్లారు. కరోనా డోసులను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఈ ఘటనకు పాల్పడిన వాళ్లెవరో తెలుసుకోవడంపై దృష్టిపెట్టారు.
  Published by:Kishore Akkaladevi
  First published: