కరోనా అంటించేందుకు కుట్ర.. సీఎం కేసీఆర్‌పై భట్టి విక్రమార్క సంచలన ఆరోపణలు

తమకు కరోనా సోకితే సీఎం, డీజీపీలదే బాధ్యత అని విరుచుకుపడ్డారు భట్టి విక్రమార్క్. రాజ్‌భవన్ ముట్టడి సందర్భంగా కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.

news18-telugu
Updated: July 27, 2020, 7:11 PM IST
కరోనా అంటించేందుకు కుట్ర.. సీఎం కేసీఆర్‌పై భట్టి విక్రమార్క సంచలన ఆరోపణలు
సీఎం కేసీఆర్, భట్టి విక్రమార్క
  • Share this:
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సంచలన ఆరోపణలు చేశారు. విపక్ష నేతలకు కరోనా వైరస్ అంటించేందుకు కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎంను విమర్శించే వాళ్లను అరెస్ట్ చేయిస్తున్నారని.. పోలీస్ స్టేషన్లు, పోలీస్ వాహనాలను శానిటైట్ చేయడం లేదని ఆయన విమర్శించారు. తమకు కరోనా సోకితే సీఎం, డీజీపీలదే బాధ్యత అని విరుచుకుపడ్డారు భట్టి విక్రమార్క్.
రాజ్‌భవన్ ముట్టడి సందర్భంగా కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్ పెద్ద రాజకీయ కుట్రదారు. ఏ స్థాయికైనా దిగజారుతారు. విపక్ష నేతలకు ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనాను అంటించే కుట్ర చేస్తున్నారు. ప్రశ్నించిన వారికి కరోనా రావాలని సీఎం కేసీఆర్ గతంలో శపించారు. సీఎంను విమర్శించే వాళ్లను అరెస్టు చేయిస్తున్నారు. పోలీసు స్టేషన్‌లో, పోలీసు వాహనాల్లో శానిటైజ్‌ చేయడం లేదు. ప్రతిపక్షాలపై ఇలాంటి చర్యలు సరికాదు. పోలీసులు అరెస్టు చేసే ముందు వాహనాలను శుభ్రపరిచి అందులో తీసుకెళ్లాలి. పోలీసు వాహనాల ద్వారా మా నాయకులకు ఎవరికైనా కరోనా సోకితే సీఎం కేసీఆర్, డీజీపీలదే బాధ్యత.
భట్టి విక్రమార్క


కాగా, రాజస్థాన్‌లో రాజకీయ సంక్షోభం వెనక బీజేపీ ఉందంటూ కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. రాజ్‌భవ ముట్టడికి ప్రయత్నించగా పోలీసులు అరెస్ట్ చేశారు. గాంధీ భవన్ వద్ద రేవంత్ రెడ్డి, వీహెచ్, అంజన్ కుమార్ యాదవ్ ఇతర కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకుని బేగంబజార్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. బీజేపీ అవలంబిస్తున్న తీరు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టని.. రాజస్థాన్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్నారని విమర్శలు గుప్పించారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు.

మరోవైపు తెలంగాణలో కరోనా జోరు కొనసాగుతోంది. కొత్తగా మరో 1473 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 55532కి చేరింది. కొత్తగా 8 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 471కి పెరిగింది. తాజాగా తెలంగాణలో 774 మంది రికవరీ అవ్వడంతో... మొత్తం రికవరీ కేసుల సంఖ్య 42106గా ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం 12955 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 363242 కరోనా పరీక్షలు చేసినట్లు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది.
Published by: Shiva Kumar Addula
First published: July 27, 2020, 7:07 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading