కరోనా కోరల్లో ముంబై.. ఆర్మీ మోహరింపుపై సీఎం ఉద్ధవ్ క్లారిటీ

ఔరాంగాబాద్‌లో జరిగిన రైలు ప్రమాద ఘటన దురదృష్టకరమి ఉద్ధవ్ థాక్రే అన్నారు. వలస కార్మికులు కొన్ని రోజులు ఓపిక పట్టాలని.. మహారాష్ట్ర ప్రభుత్వం వారికి అన్ని విధాలా అండగా ఉంటుందని చెప్పారు.

news18-telugu
Updated: May 8, 2020, 8:40 PM IST
కరోనా కోరల్లో ముంబై.. ఆర్మీ మోహరింపుపై సీఎం ఉద్ధవ్ క్లారిటీ
మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాకరే
  • Share this:
మహారాష్ట్రలో కరోనా విలయ తాండవం చేస్తోంది. కొత్త కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ముంబైలో ఆర్మీని మోహరిస్తారని రెండు మూడు రోజులుగా ప్రచారం జరుగుతోంది. కరోనాను కట్టడి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని.. ఈ క్రమంలోనే ఆర్మీని రంగంలోకి దించుతోందన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై స్వయంగా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే క్లారిటీ ఇచ్చారు. ముంబైలో ప్రస్తుతానికి ఆర్మీనికి మోహరించాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ఏం చేసినా.. ప్రజలకు చెప్పే చేశామని ఉద్ధవ్ అన్నారు. ఆర్మీని పిలవాల్సిన అవసరం దేదని ఆయన చెప్పారు.


ఔరాంగాబాద్‌లో జరిగిన రైలు ప్రమాద ఘటన దురదృష్టకరమి ఉద్ధవ్ థాక్రే అన్నారు. వలస కార్మికులు కొన్ని రోజులు ఓపిక పట్టాలని.. మహారాష్ట్ర ప్రభుత్వం వారికి అన్ని విధాలా అండగా ఉంటుందని చెప్పారు. అలా పట్టాల వెంబడి నడుకుంటూ వెళ్లడం ప్రమాదకరమన్నారు ఉద్ధవ్. కాగా, గడిచిన 24 గంటల్లో ముంబైలో 692 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 25 మంది మరణించారు. తాజా లెక్కల ప్రకారం.. ముంబైలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 11,219కి చేరింది. ఇప్పటి వరకు 437 మంది మరణించారు.

First published: May 8, 2020, 8:27 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading