కరోనాకు, చికెన్‌కు సంబంధం లేదు.. లెగ్‌పీస్ తిన్న మంత్రి కేటీఆర్

మంత్రి కేటీఆర్‌తో పాటు ఇతర మంత్రులు, సినీ సెలబ్రిటీలు చికెన్ లెగ్ పీస్‌లు తిన్నారు. చికెన్‌ సోషకాహారమని.. దానికీ కరోనా వైరస్‌కు సంబంధం చెప్పారు.

news18-telugu
Updated: February 28, 2020, 9:36 PM IST
కరోనాకు, చికెన్‌కు సంబంధం లేదు.. లెగ్‌పీస్ తిన్న మంత్రి కేటీఆర్
చికెన్ తింటున్న మంత్రులు
  • Share this:
కరోనా వైరస్‌కు, చికెన్‌కు ఎలాంటి సంబంధం లేదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ కూడా ఎంచక్కా చికెన్ తింటారని చెప్పారు. చికెన్ తింటే కరోనా వైరస్ వస్తుందన్న పుకార్లను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. చికెన్‌పై సోషల్ మీడియాలో పుకార్ల నేపథ్యంలో పౌల్ట్రీ సమాఖ్య, నెక్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని పీపుల్స్ ప్లాజాలో చికెన్ ఎగ్స్ మేళాను జరిగింది. చికెన్‌పై అపోహలను తొలగించేందుకు చికెన్, గుడ్డు వంటకాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఈటల రాజేందర్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, శ్రీనివాస్‌ గౌడ్‌, పలువురు అధికారులు, పౌల్ట్రీ పరిశ్రమ ప్రతినిధులు, సినీ నటి రష్మిక మంధాన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌తో పాటు ఇతర మంత్రులు, సినీ సెలబ్రిటీలు చికెన్ లెగ్ పీస్‌లు తిన్నారు. చికెన్‌ సోషకాహారమని.. దానికీ కరోనా వైరస్‌కు సంబంధం చెప్పారు. చికెన్‌ ఆరోగ్యానికి ఎంతో మంచిందని.. పుకార్లను నమ్మవద్దని చెప్పుకొచ్చారు.

First published: February 28, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు