కరోనా ఎఫెక్ట్.. పొలిమేరల్లోనే మృతదేహాన్ని అడ్డుకున్న గ్రామస్తులు

కరోనా వైరస్ భయంతో గ్రామంలోకి ఇతరులెవ్వరినీ అనుమతించడం లేదు. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలో మహారాష్ట్రలో అనారోగ్యంతో మరణించిన ఓ మహిళ అంత్యక్రియలు పూర్తి చేసేందుకు స్వగ్రామానికి కొడుకు తీసుకువచ్చాడు. గ్రామంలోకి రావొద్దంటూ గ్రామస్తులు పొలిమేరల్లోనే అడ్డుతగిలారు.

news18-telugu
Updated: March 26, 2020, 2:57 PM IST
కరోనా ఎఫెక్ట్.. పొలిమేరల్లోనే మృతదేహాన్ని అడ్డుకున్న గ్రామస్తులు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజూకీ పెరుగుతోంది. దీంతో ఆయా గ్రామాల్లోని ప్రజలు తమ గ్రామాల్లోకి కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఇతరులెవ్వరినీ రానీవ్వడం లేదు. చివరకు మృతదేహాలకు నిర్వహించాల్సిన అంత్యక్రియల కోసం అనుమతించడం లేదు. ఇలాంటి ఘటనే పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని సీతంపేటకు చెందిన రాజయ్య మహారాష్ట్రలోని చంద్రాపూర్‌లో సింగరేణిలో పనిచేస్తున్నాడు. ఇటీవల అనారోగ్యంతో రాజయ్య తల్లి మరణించింది. తల్లి అంత్యక్రియలు నిర్వహించేందుకు మృతదేహాన్ని స్వగ్రామమైన సీతంపేటకు తీసుకొచ్చాడు. అయితే వీరిని గ్రామంలోకి రాకుండా గ్రామస్తులు పొలిమేరల్లోనే అడ్డుకుని, గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించొద్దని తేల్చి చెప్పారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మరణ ధ్రువీకరణ పత్రం పరిశీలించి పక్షవాతంతో చనిపోయినట్టు స్పష్టం చేశారు. అయినా అంత్యక్రియలు పూర్తి చేసి గృహ నిర్బంధంలో ఉండాల్సి వస్తుందని తెలిపారు. దీంతో రాజయ్య తమ సొంత భూమిలో కార్యక్రమం నిర్వహించి వెళ్లిపోతామని చెప్పడంతో గ్రామస్తులు ఒప్పుకున్నారు. మృతదేహం వెంట వచ్చిన బంధువులే గుంత తవ్వి మృతదేహాన్ని పూడ్చి దహనసంస్కారాలు పూర్తి చేశారు.

First published: March 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు