మెక్సికో నుంచి కెనడాకు పయనం... 4200 కిలోమీటర్లు... వైరల్ వీడియో...

కొన్ని కొన్ని ప్రయాణాలు ఎంతో ఆహ్లాదం కలిగిస్తాయి. మెక్సికో నుంచి కెనడాకు వెళ్లే ప్రయాణం అలాంటిదే. దాని విశేషాలు చకచకా తెలుసుకుందాం.

news18-telugu
Updated: May 23, 2020, 2:55 PM IST
మెక్సికో నుంచి కెనడాకు పయనం... 4200 కిలోమీటర్లు... వైరల్ వీడియో...
మెక్సికో నుంచి కెనడాకు పయనం... 4200 కిలోమీటర్లు... వైరల్ వీడియో... (credit - Youtube)
  • Share this:
ఉత్తర అమెరికా దిగువన ఉండే... మెక్సికో నుంచి కెనడాకు... 4200 కిలోమీటర్ల దూరం. ఈ మార్గంలో ముందుగా కాలిఫోర్నియా రాష్ట్రం వస్తుంది. తర్వాత ఒరెగాన్, వాషింగ్టన్ వైపుగా వెళ్తారు. ఈ మార్గం మధ్యలో 25 జాతీయ అడవులు తగులుతాయి. అలాగే... 7 జాతీయ పార్కులొస్తాయి. ముందుగా... దక్షిణ కాలిఫోర్నియాలోని... 1100 కిలోమీటర్లకు పైగా ఉండే.. ఎడారిని దాటాల్సి ఉంటుంది. ఆ తర్వాత సియెర్రా నెవాడా చేరుకుంటారు. అక్కడి నుంచి... ఉత్తరంగా వెళ్తూ వెళ్తూ... కెనడాను టచ్ అవుతారు. ఈ ప్రయాణం చూడటానికి సాధారణ జర్నీలా ఉంటుంది. కానీ... వెళ్లేకొద్దీ... కొండలు ఎక్కుతున్నట్లుగా... పైకి వెళ్తూ ఉంటారు. అదే ఈ ప్రయాణంలో సాహసం.

ఏటా కొంతమంది సాహసికులు... ఉద్యోగాలు, రొటీన్ లైఫ్ పక్కన పెట్టేసి... ఛలొరె ఛలొరె ఛల్... అంటూ ఇలా బయల్దేరతారు. అంటే ఇప్పుడు మన దేశంలో వలస కూలీలు వందల కిలోమీటర్లు వెల్లట్లా... అలా అన్నమాట. ఐతే... మన కూలీలది కడుపు కష్టం. వాళ్లది క్యూరియాసిటీ. మన కూలీలవి ఆకలి బాధలు. వాళ్లది రిలాక్సేషన్. రెండూ ప్రయాణాలే, రెండూ దూర గమ్యాలే. కానీ... రెండింటి పరిస్థితులు పూర్తి భిన్నం.

ఈ ప్రయాణం పూర్తవడానికి 5 నెలలు పడుతుంది. చాలా మంది నెల ప్రయాణించి... ఈ జీవితానికి ఇది చాలు అనుకుంటారు. కొందరేమో... రెండు నెలలు వెళ్లాక... కాలిఫోర్నియాలో... సిట్టింగ్ వేసుకొని... అక్కడితో ముగించేస్తారు. కొందరు మాత్రం పట్టు వదలకుండా... పూర్తి చేసి... గ్రేట్ అనిపించుకున్నారు. అలాంటి వ్యక్తులు చేసినదే ఈ వీడియో. మొత్తం 3 నిమిషాలు ఉంది. వీలైతే చూడండి.First published: May 23, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading