Coronavirus: షాకింగ్ న్యూస్.. 960 మంది వీసాలు రద్దు.. ఎవరెవరివో తెలుసా..

నిబంధనలు ఉల్లంఘించి తబ్లీగి జమాత్‌లో పాల్గొన్న 960 మంది విదేశీయుల వీసాలను రద్దు చేస్తూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల డీజీపీలకు వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది.

news18-telugu
Updated: April 2, 2020, 8:54 PM IST
Coronavirus: షాకింగ్ న్యూస్.. 960 మంది వీసాలు రద్దు.. ఎవరెవరివో తెలుసా..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. నిబంధనలు ఉల్లంఘించి ఢిల్లీలోని తబ్లీగీ జమాత్‌లో పాల్గొన్న 960 మంది విదేశీలయుల వీసాలను రద్దు చేసింది. వీసాలతో పాటుగా వారి పాస్‌పోర్టులను సైతం బ్లాక్ లిస్ట్‌లో పెట్టింది. అయితే వీరంతా పర్యాటక వీసాలపై వచ్చి నిబంధనలకు వ్యతిరేకంగా మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపింది. సదరు విదేశీయులపై చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాల డీజీపీలకు సూచించింది. ఈ మేరకు ట్విట్టర్‌లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కార్యాలయం ట్వీట్ చేసింది. విపత్తు నిర్వహణ చట్టం-2005, విదేశీయుల చట్టం-1946ను ఉల్లంఘించి ఢిల్లీ నిజాముద్దీన్‌లోని తబ్లీగీ జమాత్‌లో పాల్గొన్నందుకు నిబంధనల ప్రకారం ఆ విదేశీయులపై చర్యలు తీసుకోవాలంటూ అన్ని రాష్ట్రాల డీజీపీలకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది.
Published by: Narsimha Badhini
First published: April 2, 2020, 8:54 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading