హైడ్రాక్సీ క్లోరోక్విన్ వాడకంపై కేంద్రం ప్రత్యేక మార్గదర్శకాలు జారీ...

COVID-19 ఆసుపత్రులలో పనిచేసే ఆరోగ్య సంరక్షణ కార్మికులు, కంటైనేషన్ జోన్లలో నిఘా విధిపై పనిచేసే ఫ్రంట్‌లైన్ సిబ్బంది, కరోనావైరస్ సంక్రమణ సంబంధిత కార్యకలాపాలలో పాల్గొనే పారామిలిటరీ / పోలీసు సిబ్బందికి నివారణ మందుగా హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను ఉపయోగించాలని సిఫార్సు చేసింది.

news18-telugu
Updated: May 23, 2020, 11:38 AM IST
హైడ్రాక్సీ క్లోరోక్విన్ వాడకంపై కేంద్రం ప్రత్యేక మార్గదర్శకాలు జారీ...
హైడ్రాక్సీ క్లోరోక్విన్ (File)
  • Share this:
హెల్త్ వర్కర్లపై మలేరియా మందు హైడ్రాక్సీ క్లోరోక్విన్ పనిచేస్తోంది. కరోనా రాకుండా అడ్డుకునేందుకు ప్రొఫైలాక్టిక్ మెడిసిన్ గా హెల్త్ వర్కర్లు, కరోనా పేషెంట్ల కుటుంబ సభ్యులు వాడొచ్చని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్ ) సూచించింది. తాజా ఆదేశాల్లో COVID-19 ఆసుపత్రులలో పనిచేసే ఆరోగ్య సంరక్షణ కార్మికులు, కంటైనేషన్ జోన్లలో నిఘా విధిపై పనిచేసే ఫ్రంట్‌లైన్ సిబ్బంది, కరోనావైరస్ సంక్రమణ సంబంధిత కార్యకలాపాలలో పాల్గొనే పారామిలిటరీ / పోలీసు సిబ్బందికి నివారణ మందుగా హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను ఉపయోగించాలని  సిఫార్సు చేసింది. ఇప్పటికే హెల్త్ వర్కర్లకు ఏడు వారాల పాటు ఈ మందును ఇచ్చి పరిశీలించారు. మంచి ఫలితాలిచ్చినట్టు గుర్తించారు. ఆ స్టడీకి సంబంధించిన మధ్యంతర నివేదికను కమ్యూనిటీ మెడిసిన్ డిపార్ట్ మెంట్ ప్రభుత్వానికి అందజేసింది. క్లోరోక్విన్ ఎఫెక్ట్ లను స్టడీ చేసేందుకు 533 మంది హెల్త్ వర్కర్లకు క్లోరోక్విన్ ను ఇచ్చారు. అందులో కరోనా పేషెంట్లను దగ్గరగా ఉండి ట్రీట్ చేసిన డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది 394 మంది ఉన్నారు. వాళ్లపై మందు పనితీరును ఏడు వారాల పాటు పరిశీలించారు. కరోనా లక్షణాలైన జ్వరం, గొంతు నొప్పి, దగ్గు వంటివి రాలేదని నిర్ధారించారు. 93 మందికి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయని నివేదికలో పేర్కొన్నారు. అయితే, ఇది మధ్యంతర నివేదిక మాత్రమేనని, తుది నివేదిక కాదని రిపోర్ట్ లో పేర్కొన్నారు.

 
First published: May 23, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading