Delta AY.4.2: బెంగళూరులో కొత్త రకం కరోనా కలకలం... Delta AY.4.2తో భయంభయం..

ప్రతీకాత్మక చిత్రం

కర్ణాటక రాజధాని నగరం బెంగళూరులో కొత్త రకం కరోనా కలకలం రేపుతోంది. యూకేలో వేగంగా వ్యాప్తి చెందుతున్న డెల్టా వేరియంట్ AY.4.2 భారత్‌ను కూడా బెంబేలెత్తిస్తోంది. కర్ణాటకలో ఇప్పటివరకూ Delta AY.4.2 కేసులు ఏడు నమోదైనట్లు ఆ రాష్ట్ర వైద్య శాఖ కమిషనర్ డి.రణ్‌దీప్ ప్రకటించారు.

  • Share this:
    బెంగళూరు: కర్ణాటక రాజధాని నగరం బెంగళూరులో కొత్త రకం కరోనా కలకలం రేపుతోంది. యూకేలో వేగంగా వ్యాప్తి చెందుతున్న డెల్టా వేరియంట్ AY.4.2 భారత్‌ను కూడా బెంబేలెత్తిస్తోంది. కర్ణాటకలో ఇప్పటివరకూ Delta AY.4.2 కేసులు ఏడు నమోదైనట్లు ఆ రాష్ట్ర వైద్య శాఖ కమిషనర్ డి.రణ్‌దీప్ ప్రకటించారు. ఇందులో మూడు కేసులు బెంగళూరులో నమోదు కాగా, మరో నాలుగు కేసులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నమోదయినట్లు ఆయన తెలిపారు.

    భారత్‌లో ఇప్పటివరకూ 17 Delta AY.4.2 కరోనా కేసులు నమోదయయ్యాయి. ఆరు రాష్ట్రాల్లో ఈ కొత్త రకం కరోనా కేసులు నమోదు కావడం గమనార్హం. ఈ శాంపిల్స్ అన్నీ మే, సెప్టెంబర్‌లో సేకరించినవిగా వైద్య శాఖ అధికారులు గుర్తించారు. ఈ కొత్త రకం కరోనా కేసులు నమోదవుతుండటం భారత్‌లో కరోనా థర్డ్ వేవ్‌కు సంకేతంగా భావిస్తున్నారు. పండుగ సీజన్‌లో ఈ కొత్త వేరియంట్ కేసులు బయటపడటంపై భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. దేశంలో కరోనా కేసులు కాస్తంత తగ్గుముఖం పట్టడంతో దాదాపు చాలాచోట్ల లాక్‌డౌన్ ఎత్తేశారు.

    ఇది కూడా చదవండి: Love Marriage: పెద్దలు ఒప్పుకోకపోవడంతో అన్నవరంలో ప్రేమ పెళ్లి చేసుకున్నారు.. కానీ దురదృష్టం ఏంటంటే...

    Delta AY.4.2 విషయానికొస్తే.. ఈ వేరియంట్ కరోనా కేసులు యూకే, చైనా, రష్యాలో ఇప్పటివరకూ నమోదు కాగా భారత్‌లో కూడా వ్యాప్తి చెందుతుండటం కొంత ఆందోళన కలిగించే విషయం. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా Delta AY.4.2 కేసులు నమోదయ్యాయి. ఏపీలో ఈ New Strain కరోనా కేసులు అత్యధికంగా ఏడు నమోదు కావడం గమనార్హం. తెలంగాణలో 2 కేసులు నమోదయినట్లు తెలిసింది. కర్ణాటకలో ఇప్పటికే ఈ Delta AY.4.2 గురించి ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఈ Delta AY.4.2 కారణంగా భారత్‌లో ఇప్పటివరకూ ఎలాంటి మరణాలు నమోదు కాకపోయినప్పటికీ ఇతర వేరియంట్స్‌తో పోల్చుకుంటే ఈ Delta AY.4.2 వేగంగా వ్యాప్తి చెందుతుందని తెలిసింది. కరోనా సెకండ్ వేవ్‌లో తీవ్రంగా నష్టపోయిన యూకేలో ఈ Delta AY.4.2 వేగంగా వ్యాప్తి చెందుతోంది. గత వారం బ్రిటన్‌లో 50 వేల కోవిడ్-19 కేసులు నమోదు కాగా వీటిలో ఎక్కువగా ఈ వేరియంట్‌కు చెందినవే కావడం గమనార్హం.

    యూకేలో స్కూల్‌కు వెళ్లే పిల్లలు ఈ మహమ్మారి బారిన ఎక్కువగా పడినట్లు తెలిసింది. ఈ Delta AY.4.2పై ప్రస్తుతం యూకే హెల్త్ ఏజెన్సీ విచారణ జరుపుతోంది. ఇదిలా ఉంటే.. AY.4.2 సోకిన వారు చనిపోయినట్లు ఇప్పటివరకూ ఎలాంటి ఆధారాలు లేకపోవడం కొంత ఊరట కలిగించే విషయం. కోవిడ్-19 థర్డ్ వేవ్ బారిన పడకుండా ఉండేందుకు కేంద్రం ఇప్పటికే కొన్ని గైడ్స్‌లైన్స్‌ను విడుదల చేసింది. బయటకు వెళ్లిన వాళ్లు కచ్చితంగా మాస్క్ ధరించాలని, శానిటైజర్‌తో చేతులను శుభ్రంగా ఉంచుకోవాలని.. తప్పనిసరి అయితే తప్ప ఎక్కువ మందితో కలవవద్దని ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ చాలామంది ప్రజలు ఎలాంటి ఆంక్షలు అమలులో లేకపోవడంతో ఈ మార్గదర్శకాలను పెద్దగా పట్టించుకోవడం లేదు.
    Published by:Sambasiva Reddy
    First published: