THE GOVERNMENT WILL IMPOSE A FINE OF RS 50 ON PASSENGERS WHO DO NOT WEAR MASKS ON APS RTC BUSES SNR
ఆ బస్సుల్లో మాస్క్ లేకుండా ఎక్కారో ..మీ తిక్క కుదురుతుంది
ప్రతీకాత్మకచిత్రం
MASK MUST: ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారిని ఏపీ ప్రభుత్వం హెచ్చరిస్తోంది. కరోనా కేసులు, పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకొని ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలని లేకపోతే 50రూపాయలు జరిమానా వసూలు చేయమని ఆదేశాలు జారీ చేసింది.
పండగకు అంతా ఊర్లు వెళ్తున్నారా...అయితే జాగ్రత్త మీ దగ్గర బస్ టికెట్ (Bus tickets)ఉండటం ఎంత ముఖ్యమో..ఏపీఎస్ ఆర్టీసీ(Apsrtc) బస్సుల్లో ప్రయాణించే వారికి మాస్క్ (MASK)అంతే ముఖ్యమనే విషయాన్ని మర్చిపోవద్దు. మాస్కు ధరించే విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా ..ఏపీ ప్రభుత్వం (Ap government)ఊపేక్షించేది లేదంటోంది. ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో (Apsrtc buses)ప్రయాణించే ప్రతి ఒక్కరు మాస్కులు ధరించడం తప్పని సరి చేస్తూ ప్రభుత్వం నూతన ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ ఎవరైనా మాస్కులు పెట్టుకోకుండా బస్సుల్లో ప్రయాణిస్తే వారి దగ్గర 50రూపాయలు(50Rupees)జరిమానా(Fine)రూపంలో వసూలు చేస్తామని ప్రయాణికుల్ని హెచ్చరించింది. ముఖ్యంగా సంక్రాంతి పండుగను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు వారి క్షేమం కోసం కోవిడ్ నిబంధనలు (Covid rules)తప్పక పాటిస్తూ ఆర్టీసీ బస్సుల్లో సురక్షితంగా ప్రయాణం చేయాలని విజ్ఞప్తి చేసింది. ఏ రాష్ట్రంలో చూసిన కరోనా కేసులకు కొదవ లేకుండా పోతోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్(Andhra pradesh)లో గడిచిన 24గంటల్లో 1257పాజిటివ్ (Positive)కేసులు(Cases)నమోదైనట్లుగా ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. ఈ కేసుల తీవ్రత రికవరీ రేటు కంటే సుమారు 10రెట్లు అధికంగా నమోదవడంతో ప్రభుత్వం, వైద్య,ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. దీనికి తోడు ఈ వారం రోజుల్లో సంక్రాంతిని పురస్కరించుకొని తెలంగాణ(Telangana)లోని హైదరాబాద్ (Hyderabad), తమిళనాడు(Tamil nadu)లోని చెన్నై(Chennai), కర్నాటక(Karnataka)రాజధాని బెంగుళూరు (Bangalore),ముంబై (Mumbai)నుంచి వేలాది మంది ఆంధ్రప్రదేశ్‌కు వస్తారు. ఈనేపధ్యంలోనే వారిని రానివ్వకుండా ఆంక్షలు పెట్టడం కుదరని పరిస్థితుల్లో ఈ విధంగా మాస్కులు ధరించడం తప్పని సరి చేస్తే కరోనా కేసుల వ్యాప్తిని అరికట్టవచ్చని ఏపీ ప్రభుత్వం ఆలోచనగా కనిపిస్తోంది.
మాస్క్ పెట్టుకోకపోతే 50రూపాయల ఫైన్
కేవలం వందల్లో నమోదయ్యే కేసులు ఒక్కసారిగా వెయ్యి దాటిపోవడంతో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది. రాష్ట్రానికి థర్డ్‌వేవ్ ముప్పు తప్పదని ప్రజల్ని హెచ్చరిస్తూనే ఎక్కడిక్కడ ముందస్తు ఏర్పాట్లు, వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగంగా ముందుకు తీసుకెళ్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో నిన్న నమోదైన కోవిడ్ కేసుల్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలోనే నమోదవడం ఒకింత భయాందోళనలను కలిగిస్తోంది. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 254పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రేణిగుంట విమానాశ్రయం, తమిళాడు సరిహద్దు ప్రాంతాలు చిత్తూరు జిల్లాకు ఆనుకొని ఉండటం కారణంగానే కేసులు పెరిగినట్లుగా అధికారులు భావిస్తున్నారు.
ఆర్టీసీ ప్రయాణికులకు ఏపీ ప్రభుత్వం మరో షాక్..
అన్నీ రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో తక్కువ శాతంలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. అయితే రానున్నవి సంక్రాంతి రోజులు కావడంతో వైరస్ వ్యాప్తి ఎక్కువగా జరిగే అవకాశమున్నట్లుగా భావిస్తోంది. అందుకే శనివారం నుంచి ఏపీలోని 13జిల్లాల్లో నైట్ కర్ఫ్యూ అమలు చేస్తోంది ఏపీ ప్రభుత్వం. కోవిడ్ కేసుల సంఖ్య మరింత పెరిగితే వీకెంట్ కర్ఫ్యూతో పాటు పండుగ వేడుకలకు కూడా కొత్త నిబంధనలు విధించే అవకాశం లేకపోలేదు.
Published by:Siva Nanduri
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.